హత్రాస్ గ్యాంగ్ రేప్: తల్లి ఆవేదన..దళితులుగా పుట్టటమే మా పాపమా? మా పిల్లలకు భద్రతలేదా?..

  • Published By: nagamani ,Published On : October 1, 2020 / 05:23 PM IST
హత్రాస్ గ్యాంగ్ రేప్: తల్లి ఆవేదన..దళితులుగా పుట్టటమే మా పాపమా? మా పిల్లలకు భద్రతలేదా?..

UP Hathras gangrape: ‘We are Dalits, that, our children safe? We want our children to leave : ఉత్తర్ ప్రదేశ్‌లో హత్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. అగ్రవర్ణాలకు చెందిన నలుగురు యువకులు దళిత యువతిపై దాడిచేసి, దారుణంగా అత్యాచారం చేసిన ఘటనలో తీవ్రగాయాలతో ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మంగళవారం (సెప్టెంబర్ 29,2020) చనిపోయింది. ఈ దారుణంపై దేశం రగిలిపోతోంది. మానవహక్కుల సంఘాలో ఘోషిస్తున్నాయి. మహిళా సంఘాల నుంచి సామాన్య మానవుల వరకూ ఈ దారుణానికి తెగబడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

దళితులుగా పుట్టటమే మా పాపమా? మా పిల్లలకు భద్రత లేదా?..
దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగిస్తున్న క్రమంలో బాధితురాలి తల్లితోపాటు హత్రాస్ ప్రాంతంలో దళితులు సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. ‘దళితులుగా పుట్టటమే మా పాపమా? మా పిల్లలు హాయిగా బతకకూడదా? చదువుకోకూడదా? మా ఆడపిల్లలకు భద్రతలేదా? అగ్రవర్ణాల వర్గాల అహంకారానికి వారి కామానికి వారి దారుణాలకు మా పిల్లలు బలికావాల్సిందేనా? అని గుండెలవిసేలా విలపిస్తూ ప్రశ్నిస్తోంది గ్యాంగ్ రేప్ కు గురైచనిపోయిన 19 ఏళ్ల బాధితురాలి తల్లి.

అగ్రవర్ణాల పిల్లలకు ఇలాగే జరిగితే పోలీసులు ఇలాగే చేస్తారా?..
చనిపోయిన బాధితురాలి అంత్యక్రియలు కూడా పోలీసులు రహస్యంగా అర్థరాత్రి కానిచ్చేశారు.  కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వకుండా పోలీసులే ఖననం చేశారు. దీంతో తమ బిడ్డ చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయామని బాధిత కుటుంబం వాపోయింది. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే ఓ అగ్రవర్ణాల పిల్లలకో జరిగితే పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తోందా మృతురాలి తల్లి. మా జీవితాంతం రాజీ పడి బ్రతకాల్సిన దౌర్భాగ్యపు దుస్థితిలో మేం బతుకుతున్నాం అని వాపోయిందామె. అట్టటగు జాతిలో పుట్టినందుకు ఈ హింసలు..అన్యాయాలు..అఘాయిత్యాలు..దారుణాలు భరించాల్సిందేనా? లేదా మా పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోవాలా? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ప్రశ్నిస్తోందా తల్లి.

హత్రాస్ లో కొంతమంది దళితులకు కాస్త భూమి ఉంది. భూమి లేనివారంతా అగ్రవర్ణాల భూముల్లోని పనిచేసుకుని బతకాలి.ఠాకూర్, బ్రహ్మణ‌ల వద్ద తాము పనిచేస్తామని..అయినా సరే తమ కూతురు ఇంత దారుణంగా అత్యాచారానికి గురై చనిపోతే తమను పరామర్శించేందుకు రాలేదని యువతి తల్లి వాపోయింది. కనీసం నోటితో కూడా పలకరించలేదు అని వాపోయిందామె.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

బలహీనవర్గాల అణచివేతపై హత్రాస్ స్థానికులు గొంతెత్తి నినాదిస్తోన్నారు. మాకు ఎన్నాళ్లీ అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా దళితులపై ఈ దాష్టీకాలేంటని హత్రాస్ స్థానికులు ఘోషిస్తున్నారు.

 

కిరాణా షాపుకు వెళ్లినా దూరంగానే నిలబడాలి..
హత్రాస్‌ జిల్లాలో చాలా చోట్ల ఇప్పటికీ దళితులు, బలహీనవర్గాలంటే అగ్రవర్ణాల వారికి చులకనభావమే. అంటరాని వారిగా ఆమడదూరం పెడతారు. ఆఖరికి దళితులు కిరాణా షాపుకు వెళ్లి సరుకులు కొనుక్కోవాలన్నా వెళితే షాపుకు దూరంగా నిలబడాల్సిందే. లేదంటే అగ్రవర్ణాల వ్యక్తులు తిట్లతో చెవులు వాచిపోవాల్సిందే. మనస్సు కృంగిపోవాల్సిందే.నోరెత్తి పల్లెత్తు మాట మాట్లాడకూడదు..తలదించుకుని వచ్చాయాల్సిందే.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

దళిత యువతి గ్యాంగ్‌రేప్ గురైన గ్రామంలో 600 కుటుంబాల వరకు ఉంటాయి. ఇందులో సగం వరకూ ఠాకూర్‌లే.. తర్వాత బ్రహ్మణ కుటుంబాలు 100 వరకు ఉంటాయి. వాల్మికీలు 15 కుటుంబాల వరకు ఉంటాయి. ఇక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యం తీవ్రంగా ఉంటుంది. దళితులు తక్కువే అయినా అగ్రవార్ణాలతే పైచేయి.

గ్రామంలోని ఆలయాల్లోకి దళితులు వెళ్లకూడదు..
ఊరిలో ఉన్న ఆలయాల్లోకి దళితులు వెళ్లకూడదు. ఒకవేళ ఎవరన్నా ధైర్యం చేసి వెళితే వాళ్లకు మూడినట్లే. ఒక్కో సందర్భంలో కొట్టి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతేకాదు అక్కడి ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో అగ్రవర్ణాల వారికి మాత్రమే ప్రవేశం.దళితులు చదువుకునేందుకువీల్లేదంటారు. అంతేందుకు చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించే.. శ్మశానాలు కూడా.. అగ్రవర్ణాల వారికి సపరేట్ గా ఉంటాయి. దళితులకు వేరుగా ఉంటుంది. అగ్రవర్ణాల శ్మశానాలలోకి కూడా దళితులకు రానీయరంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

అగ్రవర్ణాల ఆధిపత్యం..
దళితులు తక్కువే, వాల్మికీలు 15 కుటుంబాల వరకు ఉంటాయి. ఊరిలో ఉన్న ఆలయాల్లో ప్రవేశం వీరికి నిషేధం. ఇటీవల ప్రారంభమయిన స్కూళ్లలో అగ్రవర్ణాల వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. దళితులు చదువుకునేందుకు అవకాశం ఇవ్వరు. అంతేందుకు చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించే.. శ్మశానాలు కూడా.. అగ్రవర్ణాల వారికి సపరేట్.. అందులో దళితులకు రానీయరంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దళితులు పెళ్లి ఊరేగింపులు చేసుకోకూడదు..
ఓ దళిత యువతి పెళ్లి చేసుకుని అత్తగారి ఊరికి ఊరేగింపుగా వస్తుంటే అగ్రవర్ణాల పెద్దలు ఆ ఊరేగింపుని అడ్డుకున్నారు. మీ బతుకులకు ఊరేగింపులు కావాల్సి వచ్చాయా? మా ముందే ఊరేగింపు చేసుకోవటానికి ఎంత థైర్యం మీకు అంటూ ఆపేశారు. దీంతో బతిమాలుకుని కాళ్లు పట్టుకుని అగ్రవర్ణాల కుటుంబాలు ఉండే ప్రాంతం నుంచికాకుండా మరో మార్గం నుంచి ఊరేగింపుని మళ్లించాల్సి వచ్చింది.

పుట్టుక..పెళ్లి చావుల్లో కూడా భరించలేని వివక్ష..
పుట్టుక, పెళ్లి కాదు.. చనిపోయిన సమయంలో కూడా అంతులేని వివక్షలు ఎదుర్కొన్నామని తెలిపింది ఓ దళిత యువతి తెలిపింది. తమ తల్లి తమ ఇంటి బైట శవాన్ని ఉంచడానికి కూడా అగ్రవర్ణాల వారు అంగీకరించలేదని వివరించింది. తమది చిన్న ఇల్లు కావడంతో వెంటనే దహన సంస్కారాలు చేయాల్సి వచ్చిందన్నారు. దానికి మాకు కోపంతో పాటు ఉక్రోషం కూడా వచ్చిందని కానీ మా పెద్దలు మని బతుకులు ఇంతేనమ్మా వారిని ఎదిరిస్తే మనకు ఈ మాత్రం బతుకు కూడా ఉండదని తనను ఆపేశారని ఏడుస్తూ తెలిపింది.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకునే దళితుల పిల్లలతో అగ్రవర్ణాల పిల్లలు మాట్లాడరు..
ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోన్న మా పిల్లలతో..అగ్రవర్ణాలకు చెందిన వారి పిల్లలు మాట్లాడరని..తమలాగే తమ పిల్లలు కూడా వివక్ష, అంటరానితనాన్ని ఎదుర్కొవద్దని బలంగా మేం కోరుకుంటున్నామని తెలిపారు.టీచర్లు, పోలీసులు, పరిపాలనలో బ్రహ్మిన్, ఠాకూర్‌లదే రాజ్యం అని తెలిపింది. దీంతో మా పిల్లలను తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకుంటున్నామని తెలిపారు.