రూ.2,500లు ఇస్తే కరోనా లేదని రిపోర్ట్ ఇస్తాం : ప్రైవేట్ ఆస్పత్రి బేరాలు

  • Published By: nagamani ,Published On : July 6, 2020 / 04:35 PM IST
రూ.2,500లు ఇస్తే కరోనా లేదని రిపోర్ట్ ఇస్తాం : ప్రైవేట్ ఆస్పత్రి బేరాలు

రూ.2,500లు ఇస్తే కరోనా లేదని రిపోర్ట్ ఇస్తా..లేదంటే లేకపోయినా..ఉందని రిపోర్ట్ లో రాస్తానంటూ బేరాలు ఆడుతున్న ఓ ఆస్పత్రి సిబ్బంది బేరాల బేరం వెలుగులోకి వచ్చింది. కరోనా సీజన్ పలు ప్రైవేటు ఆస్పత్రులకు బంగారు బాతు గుడ్డులా మారిపోయింది. కరోనా టెస్ట్ ల పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అంతే లేకుండా పోయింది. ఎంతగా అని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏదో కూరగాయాలు బేరం ఆడినట్లుగా కరోనా టెస్టుల విషయంలో కూడా బేరాలు మొదలుపెట్టారు.రూ. 2500 ఇస్తే..కరోనా లేదనీ నెగిటివ్ అని రిపోర్టుఇస్తానంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది బేరమాడుతున్న విషయం ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.

యూపీలోని మీరట్‌కు చెందిన ఓ ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఈ దారుణానికి ఒడిగట్టారు. డబ్బులు ఇస్తే కరోనా లేదని రిపోర్టు ఇస్తామని చెబుతూ.. ఓ వ్యక్తితో మాట్లాడుతుండగా తీసిన వీడియో బైటకు రావటం సంచలన కలిగించింది. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. వెనువెంటనే ఆ ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేశారు. దానికి సీల్ వేసి కేసు నమోదు చేశారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ.. డబ్బు సంపాధించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని..ఇటువంటి ముఠాలపై నిఘా కూడా పెంచామని అధికారులు తెలిపారు. కాగా ఆస్పత్రుల నిర్వాహకులు ఇలా ఉన్నవి లేనట్లుగా..లేవని ఉన్నట్లుగా చేస్తే..ప్రజల పరిస్థితి ఏంటి అంటూ వాపోతున్నారు ప్రజలు. అసలే కరోనా భయంతో ఛస్తుంటే ఇటువంటి ఆస్పత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటీ ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.

Read Here>>మందుబాబుల ముందు జాగ్రత్త.. లిక్కర్ సేల్స్ పెరిగిపోతున్నాయ్