G20 Summit: జీ20 సమావేశాల కోసం ఢిల్లీ చేరుకున్న అమెరికా అధినేత జో బైడెన్.. విమానాశ్రయంలో ఒక ఆసక్తికర దృశ్యం

రెండు రోజుల జీ20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీలో జరగనున్నాయి. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు జీ20 కూటమిలోని ప్రపంచ దేశాధినేతలు, వారి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు

G20 Summit: జీ20 సమావేశాల కోసం ఢిల్లీ చేరుకున్న అమెరికా అధినేత జో బైడెన్.. విమానాశ్రయంలో ఒక ఆసక్తికర దృశ్యం

Updated On : September 8, 2023 / 8:09 PM IST

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం నుంచి ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక దీనికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు చేయనున్నారు. కాగా, బైడెన్ ను ఆహ్వానిస్తున్న వారిలో ఒక చిన్నారి ఉంది. అయితే ఆ చిన్నారిని హత్తుకుని ఆమెతో సరదాగా మాట్లాడారు బైడెన్.


రెండు రోజుల జీ20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీలలో ఢిల్లీలో జరగనున్నాయి. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు జీ20 కూటమిలోని ప్రపంచ దేశాధినేతలు, వారి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. జి20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద నేతలు ఢిల్లీకి వచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, అతిథులందరికీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతున్నారు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయంలో వారికి స్వాగతం పలుకుతున్నారు.