Joshimath sinking : విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషిమఠ్..: ప్రకటించిన కలెక్టర్

విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషిమఠ్ అని చమోలీ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

Joshimath sinking : విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషిమఠ్..: ప్రకటించిన కలెక్టర్

Joshimath sinking

Joshimath sinking : భూమిలోకి కుంగిపోతున్న దేవభూమి ఇక మరో ద్వారక కానుందా? దేవభూమి అయిగాన జోషీమఠ్ లో ఇళ్లు రోడ్లు ఎందుకు భూమిలోకి కుంగిపోతున్నాయి? అనేది ఇప్పుడూ ఉత్తరాఖండ్ లోనే కాదు యావత్ భారత్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎన్డీఆర్ఎప్ ఫోకస్ పెట్టింది. సీఎం ఫోకస్ పెట్టారు. అధికారులు జోషీమఠ్ లో పర్యటిస్తున్నారు. కారణాలేమిటో తెలుసుకుంటున్నారు. ఈ క్్రమంలో కేంద్ర నిపుణుల బృందాలు జోషీమఠ్ లో పర్యటించి కారణాలను క్షుణ్ణంగా తెలుసుకోనున్నారని..వీరిలో కేంద్రం జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నిపుణులు కూడా ఉన్నారని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా కలెక్టర్‌ హిమాన్షూ ఖురాన సోమవారం (జనవరి 9,2023) తెలిపారు.

Joshimath Sinking : కుంగుతున్న ‘జోషిమఠ్‌’ .. రంగంలోకి దిగిన NDRF బృందాలు

జోషీమఠ్‌(Joshimath) ప్రాంతాన్ని విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించామని కలెక్టర్‌ హిమాన్షూ ఖురాన తెలిపారు. జోషిమఠ్ లో రోజు రోజుకు భూమి కుంగిపోతోంది. 600లకు పైగా భవనాలు బీటలువారాయి. రహదారులకు భారీగా బీటలువారాయి. ఇవి అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో జోషీమఠ్ ను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రటించామని తెలిపారు.

జోషీమఠ్ , సమీప ప్రాంతాల్లో నిర్మాణ పనులపై నిషేధం విధించామని..విపత్తు ప్రభావిత ప్రజలకు రేషన్‌ కిట్లు అందజేశాం అని తెలిపారు. 603 భవనాలకు బీటలువారాయని..68 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వారు తలదాచుకొనేందుకు 223 గదులను గుర్తించామని చమోలీ జిల్లా విప్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఇంకా ఉంటున్న వారిని తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

Joshimath Sinking : రోడ్లపై పగుళ్లు, కూలుతున్న ఇళ్లు, కుంగుతున్న భూమి.. జోషిమఠ్‌లో అసలేం జరుగుతోంది? ఈ భయానక పరిస్థితులకు కారణం ఏంటి?

కాగా జోషిమఠ్ పరిస్థితులపై సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ..ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ కు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ పట్టణానికి నిర్మిస్తున్న బైపాస్‌ పనులను కూడా ఆపేశారు. జోషీమఠ్‌ ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించాలని కోరుతూ స్వామి అవిముక్తేశ్వరానంద సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రాంతాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు.

Joshimath Sinking : ద్వారకలానే.. చరిత్రలో కలిసిపోనున్న మరో చారిత్రక పట్టణం..! జోషిమఠ్‌లో భయం భయం