Viral Video: పద్దతిగా ర్యాంపుపై నుంచి నడుచుకుంటూ కాలువ దాటిన ఏనుగుల గుంపు

ఓడిశాలోని ధెంకనల్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో భారీ ఏనుగుల గుంపు ఒకటి.. పద్దతిగా కాలువ దాటుతున్న దృశ్యాలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

Viral Video: పద్దతిగా ర్యాంపుపై నుంచి నడుచుకుంటూ కాలువ దాటిన ఏనుగుల గుంపు

Elephnats

Viral Video: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో కొన్ని ఏనుగులు కాలువ దాటేందుకు తీవ్రంగా శ్రమించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాలువ గట్లు సిమెంట్ ప్లాస్టరింగ్ చేసి నున్నగా ఉండడంతో.. ఏనుగులు ఆ గట్టు ఎక్కలేక జారిపడ్డాయి. దీంతో అటవీశాఖ అధికారులు స్పందించి జేసీబీ వాహనం ద్వారా ఏనుగులను బయటకు తీసి సమీప అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించారు. కాగా అడవుల్లో ఉండే ఏనుగులు తాగు నీటి కోసం వచ్చి తరచూ కాలువలు, చెరువుల్లో చిక్కుకుంటున్నాయి. ఏనుగుల ఇబ్బందిని గుర్తిచిన ఒడిశా అటవీశాఖ సిబ్బంది..అవి క్షేమంగా కాలువలు దాటేందుకు ప్రత్యేక ర్యాంపుని ఏర్పాటు చేశారు.

Also read: Punjab Elections: నా టికెట్ ను సోనూసూద్ చెల్లికి ఇచ్చారు అందుకే బీజేపీలో చేరా: హర్ జోత్

ఓడిశాలోని ధెంకనల్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో భారీ ఏనుగుల గుంపు ఒకటి.. పద్దతిగా కాలువ దాటుతున్న దృశ్యాలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. కాలువ వద్ద వన్యప్రాణులు దాటేందుకు ఇటీవల ర్యాంపు ఏర్పాటు చేశారు స్థానిక అటవీశాఖ అధికారులు. అయితే ఈ అటవీ డివిజన్ గుండా ఒక భారీ కెనాల్(కాలువ) ప్రవహిస్తుంటుంది. వర్షాకాలంలో కాలువ నిండుగా నీరు ఉండడంతో ఏనుగులు ఇతర వన్యప్రాణులు కాలువ దాటేందుకు తీవ్రంగా శ్రమించేవి. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఇక్కడ ర్యాంపు ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు.. ఏనుగులు ఈ ర్యాంపును గుర్తుపెట్టుకుని కాలువ దాటటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ర్యాంపు ఉందని ఏనుగులు గ్రహిస్తే.. వర్షాకాలంలోనూ అవి ఇక్కడి నుంచే సులభంగా కాలువ దాటొచ్చని అటవీశాఖ సిబ్బంది పేర్కొన్నారు.

Also read: Kanuma Special: కోనసీమలో కనులపండువగా ప్రభల తీర్థం ఉత్సవాలు

ఏనుగులు ర్యాంపుపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని కొందరు వీడియో తీయగా..ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారిని సుప్రియా సాహు ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ముందు చూపుగా ర్యాంపు ఏర్పాటు చేసిన అటవీశాఖ సిబ్బందిని ఆమె అభినందించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. “వన్యప్రాణుల కోసం మంచి చర్యలు తీసుకున్నారని” కొందరు అంటే..కాలువపై ఒక బ్రిడ్జిని నిర్మిస్తే చిన్న జీవులు కూడా సురక్షితంగా ఆవలికి చేరుకుంటాయి కదా” అంటూ హితవు పలికారు.

Also read: EV Charging: దేశంలో ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు