EV Charging: దేశంలో ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు

పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లు (PCS) ఏర్పాటు చేయదలచిన వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఎటువంటి లైసెన్స్ లేకుండానే వాహన ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పటు చేసుకోవచ్చు

EV Charging: దేశంలో ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు

Ev Pcs

Updated On : January 16, 2022 / 10:43 AM IST

EV Charging: దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకువచ్చింది. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోదలచినవారు.. ఇకపై ఎటువంటి లైసెన్స్ అవసరం లేకుండానే ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం సూచనప్రాయంగా తెలిపింది. ఈప్రకారం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లు (PCS) ఏర్పాటు చేయదలచిన వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఎటువంటి లైసెన్స్ లేకుండానే వాహన ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పటు చేసుకోవచ్చు. అయితే ఆయా ఛార్జింగ్ కేంద్రాలు.. విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) మరియు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA)లు జారీ చేసిన మార్గదర్శకాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.

Also read: TS Schools: జనవరి 30 వరకు తెలంగాణలో విద్యాసంస్థలు బంద్

విద్యుత్ వాహనాలు త్వరితగతిన ప్రజలకు చేరువయ్యేలా మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే వియత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. EV ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే వ్యక్తులకు ఆదాయం పెంచే విధంగా సూచనలు కూడా చేసింది. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు (EV PCS) సరఫరా చేసే విద్యుత్ పై “సరఫరా సగటు ధర”ను మించకుండా ఒక భాగం మాత్రమే టారిఫ్‌ విధిస్తారు.

Also read: TS News: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి తెలంగాణ గవర్నర్ తమిళిసై

మార్చి 31 2025 వరకు ఈ విధానాన్ని కొనసాగించనున్నారు. PCS పాయింట్ ఏర్పాటు చేసే స్థలం విషయంలోనూ రెవిన్యూ మోడల్ ను ప్రకటించింది. PCS పాయింట్ ఏర్పాటు చేసే వ్యక్తులు.. భూ యజమానులకు(ప్రభుత్వ లేదా వ్యక్తిగత) కేవలం రూ.1/kWh ఫిక్స్డ్ ధరతో ఆదాయాన్ని పంచుకునే(రెవిన్యూ షేరింగ్) విధానంలో అద్దెగా చెల్లిస్తే సరిపోతుందని జాతీయ విద్యుత్ మంత్రిత్వశాఖ పేర్కొంది.

Also read: Congress MLA: కంగనా రనౌత్ బుగ్గల్లాంటి నున్నని రోడ్లు వేస్తా: ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే