Strange Womens : దేవేంద్రుడుకి ధమ్కీ ఇవ్వటానికి ఆయుధాలతో వెళుతున్న మహిళలు

దేవ లోకంలో ఉండే ఇంద్రుడికి వార్నింగ్ ఇవ్వటానికి మహిళలు కత్తులు..కటార్లు, బరిసెలు, కర్రలతో బయలుదేరారు. వర్షాలు కురిపించకపోతే జరిగే పరిణామాల గురించి చెబుతూ సాక్షాత్తు దేవేంద్రుడికే ధమ్కీ ఇవ్వటానికి మారణాయుధాలతో కదం తొక్కుతూ బయలుదేరారు మహిళలు.

Strange Womens : దేవేంద్రుడుకి ధమ్కీ ఇవ్వటానికి ఆయుధాలతో వెళుతున్న మహిళలు

New Project

Strange womens in Rajasthan : ఆ ఊర్లో ఆడవాళ్లంతా ఉగ్రరూపం దాల్చారు. అపరకాళికల్లాగా మారారు. కత్తులు, కటార్లు..బరిసెలు, కర్రలు, రోకళ్లు పట్టుకుని..కాళ్లకు పెద్ద పెద్ద గజ్జెలు కట్టుకుని రోడ్డెక్కారు. అందరూ వింత వింతగా అరుస్తూ..గుంపులు గుంపులుగా వెళుతున్నారు. ఆ దృశ్యం చూసినా..వారి చేసే వింత వికృతమైన అరుపులు విన్నా..గుండెల్లో దడపుడుతుంది. చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే ఆ గ్రామంలో మగాళ్లు అందరూ ఇళ్లల్లో దాక్కున్నారు. ఆ అపరకాళికలకు ఎదురు వెళ్లేందుకు సాహసించకుండా ఇళ్లలోనే తలుపులు బిగించుకుని ఉన్నారు. ఇటువంటి వింతతైన విచిత్రమైన దృశ్యాలు రాజస్థాన్‌లోని మూడు…నాలుగు గ్రామాల్లో ప్రతీ ఏటా అక్కడ జరుగుతుంటాయి. దాని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలిగితీరుతుంది. అలా వెళుతున్న మహిళలను ధైర్యం చేసి ఎందుకెళుతున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? ఏంటిదంతా అని అడిగితే వారు ఏం చెబుతారో తెలుసా? ‘దేవేంద్రడుపై బెదిరించటానికి వెళుతున్నాం’ అని చెబుతారు..!! మరి ఇన్ని విషయాలు తెలిసాక ఆ కథా కమామీషు తెలుసుకుని తీరాలనే కుతూహం కలిగి తీరుతుంది కదూ..

అవి రాజస్థాన్‌లోని ఆనంద్ ‌పురీ, కాలిజరా, సుల్లేపాట్ గ్రామాలు. వింత ఆచారం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. అదే ఈ గ్రామాలకు చెందిన మహిళలంతా గజ్జెలు కట్టుకుని..ఆయుధాలు ధరించి వింత శబ్దాలు చేసుకుంటూ ఊరంతా తిరుగుతారు. ఈ వింత ఆచారం ఈ గ్రామాల్లో 70-80 ఏళ్లుగా జరుగుతోంది. ఈ ఆడాళ్లు గాల్లో ఆయుధాలు ఊపుతూ వింత శబ్దాలు చేస్తూ..ఇంద్రలోకంలో ఉండే దేవేంద్రుడికి ఓ సందేశం పంపుతారట. ‘‘భూమిపై దేవతలను కొలుస్తాంరు. నువ్వు వాళ్లకు అధిపతివి. వర్షాలు కురిసేలా చేయటం నీ బాధ్యత..వర్షాలు పడక పడక పంటలు ఎండిపోతే..జనాలతో పాటు ఈ భూమ్మీద ఉండే జంతువులు..పశుపక్ష్యాదులు జీవితం దుర్భరమవుతుంది. దీంతో మనుషులు క్రూరంగా మారతారు. ఒకరినొకరు చంపుకునే దాకా వెళ్తారు. దొంగలు, బందిపోట్లుగా మారిపోతారు.

దాడులు, నేరాలు, ఘోరాలు పెరిగిపోతాయ్. కాబట్టి నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. ఇలా కరువు కాటకాలు కొనసాగితే మనుషులకు దేవతలపై నమ్మకాలు పోతాయి. అలా జరకుండా ఉండాలంటే..నువ్వు వర్షాలు కురిపించాలి’’ అని దేంద్రుడికి ఆ గ్రామాల మహిళలు పంపే సందేశం సారాంశం. ఒకరకంగా చెప్పాలంటే దేవేంద్రుడికి థమ్కీ ఇస్తారన్నమాట.

ఈ వింత ఆచారం గురించి గ్రామంలోని వద్ధులు మాట్లాడుతూ.. ఈ ఆచారం ఎప్పుడు మొదలైందో మాక్కూడా తెలీదు..అసలు ఇది ఎలా మొదలైందో కూడా మాకెవరికీ తెలియదు. 70-80 ఏళ్లుగా ఇది చూస్తూనే ఉన్నాం అని తెలిపారు. స్థానికంగా ‘ధాడ్’ అని పిలిచే ఈ కార్యక్రమం జరిగే సమయంలో ఇళ్లలోని పురుషులు బయటకు రాకూడదరు. కత్తులు, కటార్లు పట్టుకొని తిరిగే మహిళలకు ఎదురు పడకూడదనే నియమం ఉంది. అందుకే మహిళలు దేవేంద్రుడిని బెదిరించటానికి వెళ్లే వారికి ఎదురుపడకుండా ఇళ్లల్లోనే ఉండిపోతారు.