Dengue Cases: బెంగాల్లో విజృంభిస్తున్న డెంగీ కేసులు.. ఒక్క నెలలోనే 20 వేలకుపైగా నమోదు
దేశంలో మరోసారి డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20,000కు పైగా కేసులు నమోదయ్యాయి.

Dengue Cases: పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని డెంగీ కేసులు భయపెడుతున్నాయి. ఆస్పత్రులన్నీ డెంగీ రోగులతో నిండిపోయాయి. ప్రజలు భారీగా డెంగీ బారిన పడుతున్నారు. ప్రతి రోజూ రాష్ట్రంలో సగటున 800-900 కేసులు నమోదవుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
Jharkhand Shocker: భార్యపై అనుమానం.. కోపంతో నాలుగేళ్ల కూతురుకు నిప్పంటించిన తండ్రి
దీంతో దేశంలోనే అత్యధిక డెంగీ పేషెంట్లున్న రాష్ట్రంగా నిలిచింది పశ్చిమ బెంగాల్. గత నెల రోజుల్లోనే రాష్ట్రంలో డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఆగష్టు 31 నాటికి రాష్ట్రంలో 239 కేసులు మాత్రమే నమోదుకాగా, సెప్టెంబర్ నెలలో ఏకంగా 20,000పై చిలుకు డెంగీ కేసులు నమోదయ్యాయి. రాజధాని కోల్‌కతాతోపాటు, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, ముర్షీదాబాద్, సిలిగురి, డార్జిలింగ్ వంటి అనేక జిల్లాలు డెంగీ కేసులతో వణికిపోతున్నాయి. పారిశుధ్యంతోపాటు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండటం వంటి కారణాల వల్ల దోమలు పెరిగి డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి.
స్థానిక సంస్థలు, అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఇంకా సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో డెంగీ కేసులు విజృంభణ మొదలైంది. దీంతో ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు.