ఢిల్లీ అల్లర్ల మధ్య హిందూ-ముస్లిం పెళ్లి

ఢిల్లీ అల్లర్ల మధ్య హిందూ-ముస్లిం పెళ్లి

ఢిల్లీలో ఆందోళనలు.. సీఏఏ, యాంటీ సీఏఏ నిరసనలు కాస్తా మతాలకు అంటుకుని మసీదులు కాల్చేసే స్థాయికి మారిపోయింది. మసీదులపై కాషాయ జెండా ఎగరేస్తూ మత విద్వేషపూరితమైన ఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలో ఓ జంట సాహసమే చేసింది. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో నివాసముండే హిందూ కుటుంబానికి చెందిన యువతి ముస్లింను పెళ్లాడింది. 

స్వయంగా తండ్రే కూతురి వివాహ తంతును ఎటువంటి అల్లరి మూకలు దాడి చేయకుండా దగ్గరుండి జరిపించాడు. పొరుగింటి వారైన ముస్లింలు తాము ఎప్పటి నుంచో కుటుంబంలా కలిసి ఉంటున్నామని ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాడు. ‘ముస్లిం సోదరులు ఇప్పటికీ మమ్మల్ని సంరక్షిస్తున్నారని పెళ్లికూతురి తండ్రి అన్నారు. చాంద్‌బాగ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో వివాహ వేడుక జరిగింది.

కొద్ది దూరంలోనే అక్కడి వాతావరణమంతా యుద్ధాన్ని తలపిస్తూ రచ్చరచ్చగా మారింది. కార్లు, షాపులు ధ్వంసం చేసి రాళ్లతో దాడిచేస్తున్నారు ఆందోళనకారులు. 32మంది దాడుల్లో చనిపోయారు కూడా. దశాబ్ద కాలంలో ఇటువంటి దారుణమైన ఘటన చోటు చేసుకోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. 

Also Read | AAP తాహిర్ హుస్సేన్ ఇంట్లో యాసిడ్ ప్యాకెట్లు

‘బాగా పొగలు వస్తుండటంతో మేం టెర్రస్‌పైకి పరుగులు పెట్టాం. శాంతిని కోరుకునే వాళ్లం. మాకు ఇవన్నీ వద్దు. ఈ ఆందోళనల వెనుక ఎవరున్నారో మాకు తెలీదు. హిందువులు, ముస్లింలకు సంబంధం లేని వాళ్లే ఇవన్నీ చేస్తున్నారనిపిస్తోంది’ అని పెళ్లికూతురి తండ్రి అన్నాడు. 

ఇంట్లో ఉండి హెన్నా పెట్టుకుంటున్నా. తర్వాతి రోజుకు పరిస్థితులు సెట్ అవుతాయని అనుకున్నానని పెళ్లికూతురు చెప్పగా.. సంతోషంగా ఉండాల్సిన రోజు ఆందోళనల కారణంగా ఆమె ఏడుస్తుందంటూ సమీనా బేగం అనే పొరుగు యువతి విచారం వ్యక్తం చేసింది. 

హిందూ ఏంటి ముస్లిం ఏంటి మనమంతా మనుషులం. ఈ యుద్ధం మతాల మధ్య కాదు.. వేరే కారణాల వల్ల మాత్రమే జరుగుతుండొచ్చని సావిత్రి సోదరి పూజా అన్నారు. 

ముస్లిం ఆందోళనకారుల నుంచి పెళ్లికొడుకు వాళ్లు.. హిందూ ఆందోళనకారుల నుంచి పెళ్లికూతురి తరపు వాళ్లు ఎటువంటి ఆందోళనలు జరగకుండా కాపాడుకుంటూ పెళ్లి తంతును పూర్తి చేశారు. పెద్ద ఎత్తులో జరగాల్సిన సంబరాలను మోతాదు తగ్గించి మామూలుగా పూర్తి చేశారు. ఈ గొడవల కారణంగా తమ పిల్లల పెళ్లికి హాజరయ్యేందుకు బంధువులు ఒక్కరు కూడా రాలేకపోయినప్పటికీ తంతు పూర్తి అయిందని ఇరు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.