Dogs: కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?

మన దైనందిన జీవితంలో అనేక ఘటనలు చూస్తుంటాం. అవి చిన్నవే అయినప్పటికీ.. వాటి వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించము. ప్రతిరోజూ మనం రోడ్లపై వెళ్తుంటే కుక్కలు తారస పడుతుంటాయి. అవి ఎక్కువగా మూత్ర విసర్జన చేసేటప్పుడు విద్యుత్ స్తంభాలు, గోడలు, కారు టైర్లపై మూత్ర విసర్జన చేస్తుంటాయి. అసలు ఇవి ఎందుకు ఇలా చేస్తాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి...

Dogs: కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?

Dogs

Dogs: మన దైనందిన జీవితంలో అనేక ఘటనలు చూస్తుంటాం. అవి చిన్నవే అయినప్పటికీ.. వాటి వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించము. ప్రతిరోజూ మనం రోడ్లపై వెళ్తుంటే కుక్కలు తారస పడుతుంటాయి. అవి ఎక్కువగా మూత్ర విసర్జన చేసేటప్పుడు విద్యుత్ స్తంభాలు, గోడలు, కారు టైర్లపై మూత్ర విసర్జన చేస్తుంటాయి. అసలు ఇవి ఎందుకు ఇలా చేస్తాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. చిన్న పిల్లలు సైతం తరచూ పెద్దవారిని ఇలాంటి ప్రశ్నలు అడుతుంటారు. కానీ ఏదోఒక సమాధానం చెప్పి వారికి సర్ధిచెప్పే ప్రయత్నం జరుగుతుంది. కుక్కలు అలా మూత్ర విసర్జన చేయటానికి పలు కారణాలు ఉన్నాయట. కుక్కల వైద్య నిపుణులు ఈ విషయాలపై పూర్తి అధ్యయంన చేశారు. కుక్కలు మూత్ర విసర్జన చేసేటప్పుడు కారు టైర్లు, గోడలు, విద్యుత్ స్తంభాలను ఆశ్రయించడానికి మూడు కారణాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.

Dogs Birthday: పెంపుడు కుక్క పుట్టినరోజున 150 మందికి బిర్యానీ దానం చేసిన దినసరి కూలీ

ప్రధానంగా విద్యుత్, ఇతర పోల్స్, టైర్లుపై మూత్ర విసర్జన చేయడం ద్వారా కుక్కలు తమ మార్గాన్ని సహచర కుక్కలకు చూపుతాయట. అంటే.. ఓ కుక్క ఒకదారిలో వెళ్తున్నప్పుడు అదివెళ్లే దారిలో పోల్స్, టైర్లు మీద మూత్ర విసర్జన చేయడం ద్వారా దాని వెనుకాల వచ్చే కుక్కలకు దాని మార్గాన్ని తెలుసుకొనేందుకు చాలా ఈజీ అవుతుందట. మరోవైపు కుక్కలు క్షితిజ సమాంతర ఉపరితలాల కంటే నిలువు ఉపరితలాలపై మూత్ర విసర్జన చేయడానికి ఇష్టపడతాయి. టైర్, పోల్ యొక్క దిగువ భాగం కుక్క ముక్కుకు చేరుకునేంత దూరంలో ఉంటుంది. అందువల్ల.. అవి ఇతర కుక్కల ముక్కు స్థాయిలో తమ గుర్తును వదిలివేస్తాయి. కుక్క మూత్రం వాసన చాలా కాలం పాటు రబ్బరు టైర్‌లో ఉంటుంది.

Wild Dogs: అడవి కుక్కల భయంతో అడుగుపెట్టలేకపోతున్న పులులు

మరోవైపు కుక్కలు నేలపై మూత్ర విసర్జన చేస్తే, వాటి వాసన తక్కువ వ్యవధిలో ముగుస్తుంది. కుక్కలు రబ్బరు టైర్లపై మూత్ర విసర్జన చేయడానికి మరొక కారణం ఉందని కుక్కల వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కుక్కలు ఎక్కువగా రబ్బరు వాసనను ఇష్టపడతాయట. అందుకే టైరు వాసనకు ఆకర్షితులై దాని దగ్గరకు వెళ్లి మూత్ర విసర్జన చేసి తిరిగి వస్తుంటాయి.