Wild Dogs: అడవి కుక్కల భయంతో అడుగుపెట్టలేకపోతున్న పులులు

కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలో అడవికుక్కల సంఖ్య పెరుగుతోంది. అభయారణ్యం పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాలు, అధికారులు గుర్తించిన ఆనవాళ్లను బట్టి.. 200 వరకు అడవి కుక్కలు ఉన్నట్లు....

Wild Dogs: అడవి కుక్కల భయంతో అడుగుపెట్టలేకపోతున్న పులులు

Wild Dogs

Wild Dogs: కవ్వాల్‌ టైగర్‌జోన్‌ పరిధిలో అడవికుక్కల సంఖ్య పెరుగుతోంది. అభయారణ్యం పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాలు, అధికారులు గుర్తించిన ఆనవాళ్లను బట్టి.. 200 వరకు అడవి కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. అందులో ప్రత్యేకంగా జన్నారం అటవీ డివిజన్‌లోనే సుమారుగా 90 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

గుంపులుగా వచ్చి వన్యప్రాణులపై దాడికి దిగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జన్నారం డివిజన్‌లో ఇలాంటివి 8గ్రూపుల వరకు ఉన్నట్లు సమాచారం. వీటి కారణంగా పులి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వీటి ప్రభావానికే జన్నారం అటవీడివిజన్‌లో పులి అడుగు పెట్టడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

కవ్వాల్‌ అడవులు పులులకు అనువుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్‌లో టైగర్‌జోన్‌గా ప్రకటించింది. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా అడవులు ఈ టైగర్‌జోన్‌ పరిధిలోకే వస్తాయి. 892.23 చదరపు కిలోమీటర్ల కోర్‌ ఏరియా, 123.12 చదరపు కిలోమీటర్ల బఫర్‌ ఏరియాగా గుర్తించారు.

………………………………………….: పాకిస్తాన్‌లో ఫస్ట్ ఒమిక్రాన్‌ కేసు

మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్, టైగర్‌ రిజర్వ్, చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్‌జోన్‌లో పులుల సంఖ్య అధికంగా ఉండటంతో కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లో పులులు ఆవాసం ఏర్పర్చుకుంటాయని అధికారులు భావించారు.