Hand Wash : చేతులు 20 సెకన్లపాటు ఎందుకు శుభ్రం చేసుకోవాలి?

ప్రతి ఒక్కరు 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. 20 సెకన్లు ఎందుకు వాష్ చేసుకోవాలి అనే దానిపై విశ్లేషణ చేసి వివరించారు శాస్త్రవేత్తలు.

Hand Wash : చేతులు 20 సెకన్లపాటు ఎందుకు శుభ్రం చేసుకోవాలి?

Hand Wash

Hand Wash : కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరికి సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ అలవాటైంది. నిత్యం చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. చాలామంది నిపుణులు 20 సెకన్లపాటు చేతులు కొడుక్కోవాలని చెబుతున్నారు. 20 సెకన్ల పాటు ఎందుకు కడుక్కోవాలి అనే దానిపై అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు విశ్లేషణ జరిపి వివరాలు వెల్లడించారు.

ఆ విశ్లేషణ ప్రకారం, వైరస్‌ మన అరచేతుల్లోని గీతల మధ్య నిశ్చింతగా జీవిస్తుంది. నీటి ధార ఆ ఇరుకు లోతుల వరకు వెళ్లి, వైరస్‌ను వెలికితీయాలంటే 20 సెకన్లు తప్పనిసరి. కొందరు చాలా సున్నితంగా చేతులు కడుగుతుంటారు, ట్యాప్ వాటర్ కూడా నెమ్మదిగా సన్నధారలా వస్తుంటుంది. ఇటువంటి సమయంలో అరచేతుల్లోని గీతల్లోకి నీరు వెళ్లి వైరస్ ను చంపాలంటే సమయం పడుతోంది. చేతులు మొత్తం తడిసేలా హ్యాండ్ వాష్ కావాలంటే 20 సెకన్లు పడుతుంది. అందుకే 20 సెకన్లపాటు కడుక్కోవడం శ్రేయస్కరమని చెబుతున్నారు పరిశోధకులు.