Bharat Jodo Yatra: తమిళ యువతిని పెళ్ళి చేసుకుంటారా సార్? రాహుల్‌ను ప్రశ్నించిన మహిళ.. ఆయన ఏమన్నారంటే..

భారత్ జోడో పాదయాత్రలో భాగంగా తమిళనాడులోని మార్తాండం ప్రాంతంలో ఉపాధి కూలీలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సంపాదన, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. రాహుల్ వారితో సరదాగా ముచ్చటిస్తుండటంతో ఓ మహిళ రాహుల్‌ను మీరు తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా సార్ అంటూ ప్రశ్నించింది..

Bharat Jodo Yatra: తమిళ యువతిని పెళ్ళి చేసుకుంటారా సార్? రాహుల్‌ను ప్రశ్నించిన మహిళ.. ఆయన ఏమన్నారంటే..

Rahul Gandhi

Bharat Jodo Yatra: నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించారు. శనివారం ఈ యాత్ర తమిళనాడు రాష్ట్రంలో ముగిసి.. కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది. తన పాదయాత్రలో భాగంగా రాహుల్ తమిళనాడులోని ప్రజలను కలుసుకుంటూ, వారిసమస్యలను వింటూ ముందుకుసాగారు. మహిళా ఉపాధి హామీ కూలీలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. అదేవిధంగా ఆసియాలోని ప్రథమ మహిళా బస్సు డ్రైవర్ 63ఏళ్ల వసంతకుమారిని కలుసుకున్నారు. మార్తాండమ్‌లోని పారిశుధ్య కార్మికులతో కూడా సంభాషించారు. కేరళ సరిహద్దు సమీపంలో, తమిళనాడు యాత్ర ముగింపులో రాహుల్ గాంధీ టీ-స్టాల్ యజమానితో మాట్లాడాడు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రశాంత్ కిశోర్ సెటైర్లు

ఉపాధిహామీ మహిళా కూలీలతో భేటీ సందర్భంగా రాహుల్ వారితో సరదాగా ముచ్చటించారు. వారి ఆదాయం, కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అందులోని ఓ మహిళ రాహుల్ కు ఊహించని ప్రశ్నను సంధించింది. మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు.. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. మీరేమంటారు అంటూ రాహుల్ ను మహిళ ప్రశ్నించింది. దీంతో రాహుల్ ఆమె వంకచూసి నవ్వుతూ ఉండిపోయాడు. అనంతరం మరికొద్దిసేపు వారితో రాహుల్ సరదాగా మాట్లాడుతూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.

రాహల్‌ను పెళ్లివిషయంపై ఓ మహిళ అడిగిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ఈ క్రమంలో రాహుల్ వారితో ఎంతో ఉత్సాహంగా కనిపించాడని, ఇందుకు సంబంధించిన ఫొటోలనుసైతం ట్వీట్ చేశారు. శనివారం సాయంత్రం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కేరళ రాష్ట్రంలో 18రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.