ప్రపంచ గుడ్డు దినోత్సవం : గుడ్డు..వెరీ గుడ్డు

  • Published By: madhu ,Published On : October 9, 2020 / 07:41 AM IST
ప్రపంచ గుడ్డు దినోత్సవం : గుడ్డు..వెరీ గుడ్డు

world egg day : బ్రహ్మచారికి అమృత బాండం… బడ్జెట్‌ పద్మనాబాలకు ప్రియం… చిన్నారులకు శ్రేష్టమైన ఆహరం. వృద్దులకు మెత్తటి మజా. క్రీడాకారులకు మంచి శక్తిప్రదాయిని…అందరి నేస్తం. అదేనండి కోడిగుడ్డు. నేడు వరల్డ్‌ ఎగ్‌ డే.
బ్రేక్‌ పాస్ట్‌, బిర్యాని… అసలు అదిలేనిదే ఎగ్‌టేరియన్లకు అన్నం సహించదు. అందుకే నగరవాసులు రోజుకు అక్షరాల ఒకటున్నర కోట్ల గుడ్లను గుటుక్కుమనిపిస్తున్నారు.



అనుకోకుండా అర్ధరాత్రి బంధువులు వచ్చినా, ఆఫీసు నుండి ఆవురావురుమంటూ శ్రీవారు వచ్చినా ఠక్కున మెరిసే తరుణోపాయం ఆమ్లెట్‌. తెలంగాణలో దాదాపు మూడున్నర కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో 4 నుండి నాలుగున్నర కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. భారత దేశం గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోమూడవ స్థానంలో ఉన్నా, వినియోగంలో మాత్రం 115 స్థానంలో ఉంది. అయితే గుడ్డు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



గుడ్డుపై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి. ఎగ్‌లో పోషక విలువలపై ప్రపంచ వ్యాప్తంగా నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో గుడ్డును మించిన ఆహరం మరొకటి లేదని ఇప్పటికే తేల్చారు. కోడిగుడ్డులో డి విటమిన్‌ అధిక మోతాదులో దొరుకుతుంది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆమ్లాలు, ప్రోటీన్లు శరీరంలో దెబ్బతిన్న బాగాలకు కణాల అభివృద్దికి అవసరమయ్యే మాంసకృత్తులు పుష్కలంగా లభ్యమవుతాయి. కళ్లకు అవసరమైన విటవిన్‌ ‘ఏ’ , ఎముకలు , దంతాల వటుత్వానికి అవసరమైన ‘ డి’ విటమిన్‌ ఇందులో అధికం.



గుడ్డు తినే ముందు జాగ్రత్తలు : – 
ఒక్క నిమిషం….గుడ్డును తినేటప్పుడు చిన్నపాటి జాగ్రత్తలు తప్పని సరి. ఎప్పుడూ తాజా వాటినే తీసుకోవాలి. గుడ్డు మంచినీటిలో వేస్తే తేలిందనుకోండి… అది కుళ్లిపోయినట్లే. సరైన తెమ ఉన్నచోట వీటిని నిల్వచేయాలి. మరి ఎక్కువ వేడి మరీ తేమ పనికి రావు. ఉల్లిపాయలు, నెయ్యికి వీటిని దూరంగా ఉంచాలని వైద్యులు పేర్కోంటున్నారు.



ప్రిజ్‌ నుండి తీసిన వెంటనే నేరుగా ఉడికించకుండా కాసేపు వేడి నీటిలో ఉంచి ఆ తరువాత ఉడికించాలి. గుడ్డు ఉడికించిన తరువాత చన్నీళ్ళలో రెండు నిమిషాలు ఉంచాలి. అప్పుడు తెల్ల, నల్ల పొనల మధ్య నల్లని పొర ఏర్పడుతుంది. సౌందర్య పోషనకు గుడ్డులోని తెల్లసొన ఎంతో మేలు చేస్తుంది.



నగరంలో రోజు గుడ్ల వినియోగం 1.5 కోట్లు.
తెలంగాణలో ప్రతిరోజు గుడ్ల ఉత్పత్తి 3.5 కోట్లు.
ఏపిలో గుడ్ల ఉత్పత్తి 4 – 4.5 కోట్లు.
గుడ్ల ఉత్పత్తిలో భారత దేశం 3 స్థానం.
వినియోగంలో 115 స్థానం.



ఏడాదికి ఒక మనిషి తింటున్న గుడ్లు 75.
నగరంలో ప్రతి ఒక్కరు ఏడాదికి 180.
గ్రామాల్లో ఒక్కొక్కరు 25 గుడ్లు.
విదేశాల్లో ప్రజలు తింటున్న గుడ్లు ఏడాదికి 250.
గుడ్డు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.