Rahul Gandhi: కొవిడ్ సమయంలో అంతా నష్టపోతే అదానీ ఆస్తులెలా పెరిగాయి

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇండియన్ వ్యాపారవేత్త గౌతం అదానీ ఆస్తులను ఆరా తీస్తున్నారు. కొవిడ్ 19 మహమ్మారి సమయంలో అతని ఆస్తులు 50శాతం ఎలా పెరిగాయని ప్రశ్నించారు. '2020లో మీ ఆదాయం ఎంత పెరిగింది?

Rahul Gandhi: కొవిడ్ సమయంలో అంతా నష్టపోతే అదానీ ఆస్తులెలా పెరిగాయి

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇండియన్ వ్యాపారవేత్త గౌతం అదానీ ఆస్తులను ఆరా తీస్తున్నారు. కొవిడ్ 19 మహమ్మారి సమయంలో అతని ఆస్తులు 50శాతం ఎలా పెరిగాయని ప్రశ్నించారు. ‘2020లో మీ ఆదాయం ఎంత పెరిగింది? సున్నా కదా. మీరు బతకడానికే అంత కష్టపడితే అతని సంపాదన 50శాతం అంటే రూ.12లక్షల కోట్లు పెరిగింది. అదెలా జరిగిందో చెప్తారా?’ అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ప్రశ్నించారు.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ కథనం ప్రకారం.. అదానీ ఆస్తులు 16.2బిలియన్ డాలర్ల నుంచి 2021లో ఒక్కసారిగా 50బిలియన్ డాలర్లు సంపాదించేశారు. ప్రపంచంలోనే అత్యంత సంపాదనపరుడిగా మారి జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్ లను దాటేశారు.

బీజేపీ పాలిత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రాహుల్.. అంబానీ, అదానీలకు మాత్రమే అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్తున్నారు. రీసెంట్ గా కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త రైతు చట్టాలను రాహుల్ ప్రస్తావించారు.

ప్రస్తుతం దేశంలో మేమిద్దరం, మా ఇద్దరు అన్న రేంజ్ లోనే సాగుతున్నాయని.. రైతుల కథ ముగించి, చిన్న, మధ్య, దుకాణదారుల నోర్లు మూయించి ప్రధాని పెట్టుబడిదారి స్నేహితులనే బాగు చేయాలనుకుంటున్నారని విమర్శించారు.