Man Posts Hilarious Tweet : జెప్టో కంపెనీ జాబ్ ఆఫర్‌పై వైరల్ అవుతున్న యువకుడి ట్వీట్

జెప్టోలో (Zepto) ఒక జాబ్‌కి అప్లై చేస్తే మరో జాబ్ ఆఫర్ ఇచ్చారు ఓ యువకుడికి. షాకై ఈ విషయాన్ని అతను ట్విట్టర్‌లో షేర్ చేసుకోగానే మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేంటో చదవండి.

Man Posts Hilarious Tweet : జెప్టో కంపెనీ జాబ్ ఆఫర్‌పై వైరల్ అవుతున్న యువకుడి ట్వీట్

Man Posts Hilarious Tweet

Man Posts Hilarious Tweet : ఒక పోస్ట్‌కి జాబ్‌కి అప్లై చేస్తే మరో పోస్ట్‌కి సెలక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రముఖ కిరాణా డెలివరీ యాప్‌లో ఆచార్య అనే వ్యక్తి జాబ్ కోసం అప్లై చేసినపుడు తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. అతని పోస్ట్ వైరల్ అవుతోంది.

Twitter Blue Tick : కాళ్ల మీద పడమంటావా.. అమితాబ్ ప్రశ్న.. ట్విట్టర్ బ్లూ టిక్ పై సెలబ్రేటిస్ ఫన్నీ ట్వీట్స్..

జెప్టోలో (Zepto) జాబ్ కోసం ఆచార్య అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఎదురైన వింత అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నాడు. రీసెంట్‌గా ఆచార్యకు Zepto చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) నుంచి ఊహించని మెయిల్ వచ్చిందట. అందులో ‘జెప్టో డెలివరీ బాయ్ (ముంబయి) జాబ్‌కి మీరు సరిపోతారు’ అని సారాంశమట. షాకైన ఆచార్య దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో (@yashachaarya) షేర్ చేసుకున్నాడు. ‘నేను ప్రాడక్ట్ డిజైనర్ జాబ్ కోసం దరఖాస్తూ చేస్తాను’ అని శీర్షిక పెట్టాడు. అతని పోస్ట్ చేసిన రెండు గంటల తర్వాత జెప్టో కో ఫౌండర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) కైవల్య వోహ్రా స్పందించారు. ‘హే మీ ట్వీట్ చూసాను. మీరు రెజ్యూమ్/పోర్ట్ ఫోలియో ద్వారా పంపగలరా?’ అని దాని సారాంశం.

SBI Server Down : టెక్నికల్ స్టాఫ్ లంచ్ చేస్తూ ఉండిపోయారేమో?.. SBI కస్టమర్స్ ఫన్నీ జోక్స్ వైరల్

ఇప్పుడు ఆశ్చర్యపోవడం ఆచార్య వంతైంది. ఆచార్య పోస్ట్ వైరల్ అవుతోంది. చాలామంది ‘నిజమేనా?’ అంటూ స్మైలీ ఇమోజీలు పెట్టారు. జెప్టో సహ వ్యవస్థాపకుడు మిస్టర్ వోహ్రా వయసు 20 సంవత్సరాలు. సంపన్న భారతీయుల్లో చాలా చిన్న వయస్కుడు.