Imaginary Cricket : బంతీలేదు, బ్యాటు లేకుండా క్రికెట్ .. ఈ పెద్దాయనకు సిక్సర్ మించి స్కోర్ ఇవ్వాల్సిందే..
చేతలో ఏమీ లేకుండా ఫీల్ అవ్వటం ఎలాగో..ఈ ఫీల్ ను ఆస్వాదించటం ఎలాగో ఈ పెద్దాయన్ని చూస్తే తెలుస్తుంది. ఆనందాన్ని మించినది ఏమీ లేదనటానికి ఏమీ లేకుండా అన్ని ఉన్నాయని..ఫీల్ అవ్వటం అంటే అదో అద్భుతమైనదేననిపిస్తుంది ఈ పెద్దాయన్ని చూస్తే..

Old man Imaginary Cricket : చేతిలో బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడితే మజా ఏముంది..? చేతిలో బాల్ పట్టుకుని బౌలింగ్ చేస్తే కిక్ ఏమొస్తుంది..? అందుకే చేతిలో బ్యాటూ లేదు..బౌలింగ్ చేసే బౌలరు లేదు. అయినా ఓ వృద్ధుడు మాత్రం క్రికెట్ సూపర్ గా ఆడాడు.ఏంటీ రెండు లేకుండా క్రికెట్ ఎలా ఆడతారు…అలా ఆడితే దాన్ని క్రికెట్ అంటారా? అని అంటున్నారా?..పోనీ అనుకుంటున్నారా..? కానీ ఇదిగో ఈ వృద్ధుడు ఆడింది క్రికెట్ కాదని అనగలరా..? ఎవ్వరు అనే ఛాన్సే లేదు అనేలా ఉందీ ఇదతగాడి ధీమా…ఓ వృద్ధుడు రోడ్డుపై గాల్లోనే క్రికెట్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న వీడియో చూస్తే నిజమే క్రికెట్ ఆడాలంటే బ్యాటు, బంతి ఉండాల్సిన పనిలేదు..జస్ట్ ఫీల్ ఉంటే చాలంటారు..
Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్య గుడి కోసం .. ప్రపంచంలోనే అతి పెద్ద తాళం
మాంచి హుషారుగా రోడ్డు పక్కన నడుస్తు నడుస్తు ఒక్కసారిగా క్రికెట్ గుర్తుకొచ్చినట్లుంది ఇతగాడికి..రోడ్డు పక్కన బ్యాటింగ్ చేస్తున్న పొజిషన్‌లో నిల్చున్న వృద్ధుడు బౌలర్ బంతి వేస్తున్నట్టు ఊహించుకుని ఫ్రంట్‌పుట్‌కు వచ్చి బలంగా బాదాడు. అంతే బంతి గాల్లోకి లేచి స్టాండ్స్‌లోకి దూసుకెళ్లినట్టు ఊహించుకుంటూ సంతోషంగా ముందుకు కదిలాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇతను కొట్టిన షాటుకి సిక్స్ అని సిగ్నల్ ఇచ్చినా తక్కువేననిపిస్తోంది.
ఏంటీ ఇది ఎక్కడ జరిగిందో చెప్పాల్నా..ఎక్కడ జరిగితే ఏముందండీ ఫీలింగ్ ముఖ్యంగానీ..ఇతను ఫీల్ అయినదానికంటే ఏదీ ముఖ్యంగా కాదని తీరుతారు ఈ వీడియో చూస్తే..ఈ వీడియో చూసిన నెటిజన్ల ఫీల్ కూడా అదే. ఇతగాడు కొట్టి షాట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Mother Dating offer : 100 మందితో డేటింగ్ చేస్తే రూ.40లక్షలు ఇస్తానంటు కూతురికి తల్లి ఆఫర్
క్రికెట్‌పై ఆ వృద్ధుడికి ఉన్న పాషన్‌కు అది నిదర్శనమంటున్నారు. అతడి స్టాండింగ్ పొజిషన్, ఫ్రంట్‌పుట్‌కు వచ్చిన తీరు..ముందుకు వచ్చి ప్రేక్షకుల వైపు తిరిగి అభివాదం చేయడం చూస్తుంటే ఏస్టార్ క్రికెటర్ కి ఈ ఫీల్ వచ్చిఉండదేమోనంటున్నారు. మరి ఈ ఫీల్ వీడియోపై మీరూ ఓలుక్కేయండీ ఆయనకు మంచి స్కోర్ ఇవ్వండీ..
Cricket is the game of emotions. ❤️ pic.twitter.com/H2N14NGb9p
— Prayag (@theprayagtiwari) August 5, 2023