Assam Govt : రెండో పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి : ఉద్యోగులకు సీఎం వార్నింగ్

రెండో వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి భార్య అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగి బహు భార్యాత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Assam Govt :  రెండో పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి : ఉద్యోగులకు సీఎం వార్నింగ్

Assam Govt employee 2nd marriage

Assam Himanta Biswa Sarma : రెండో వివాహం విషయంలో అస్సోం ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు రెండో వివాహం చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు తమ జీవిన భాగస్వామి జీవించి ఉన్నా రెండో వివాహం చేసుకోవాలనుకుంటే కుదరదు అని స్పష్టం చేసింది. అలా చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం అనుమతి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆడవారైనా..మగవారైనా వారి జీవి భాగస్వామి బతికుండగా మరో పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని అక్టోబరు 20న ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరజ్ వర్మ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ అంశంపై ఏ కమ్యూనిటీ ప్రస్తావన తీసుకురాకుండానే సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతు..రెండో వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి  భార్య అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. మొదటి భార్య జీవించి ఉన్నా రెండో వివాహం చేసుకోవటానికి అర్హులు కాదని..అలా చేసుకోవాలనుకునేవారు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని..ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహు భార్యాత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Indian in Qatar: ఖతార్‌లో 8 మంది భారత సైనికులకు మరణశిక్ష.. వారిని కాపాడేందుకు భారత్‭కు 4 మార్గాలు

మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు పెన్షన్ కోసం క్లెయిమ్‌ చేయడంలో వివాదాలు ఉన్నందున ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ స్పష్టం చేశారు. ఇద్దరు భార్యలు ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెన్షన్ తీసుకునే విషయం ఎవరికి అర్హత గలవారు అనే విషయంలో వివాదాలు ఏర్పడుతున్నాయని అందుకే ఈ నిర్ణయాలన్ని కఠినంగా అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు.

‘‘అసోం ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి రెండవ వివాహం చేసుకోవడానికి అర్హులు కాదని.. కొన్ని మతాలు రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతిస్తే..వారు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి అని’’ అని సీఎం హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పారు.

కాగా..కొన్ని మతాల్లో బహు భార్యత్వానికి అనుమతి ఉండడంతో ఇలాంటి నిబంధనలు పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఉద్యోగి మరణించాక అతని (బహుభార్యాత్వం గలిగి ఉన్నవారు) భార్యలు పింఛనుకు అర్హత విషయంలో గొడవపడుతున్న కేసులు తరచూ జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటువంటి నిబంధనలను ప్రత్యేకించి పొందుపరిచి అమలుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

West Bengal minister : రేషన్ స్కాం కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అరెస్ట్

ఫించను కోసం వివాదాలు పెరటంతో వింతతువులు పించన్ తీసుకునే విషయంలో సమస్యలు తలెత్తి దాన్ని పొందలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో రెండో వివాహం విషయంలో అస్సాం సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ 1965లోని రూల్ 26లోని నిబంధనల ప్రకారం ఆర్డర్ మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.