Kashnir fish Catch fest : కశ్మీర్‌లో ఫిషింగ్ ఫెస్టివల్ .. నీటి వనరుల శుద్ధి కోసం ఎకో ఫెస్టివల్ సంప్రదాయం

నీటిలో దిగి చేపలు పట్టుకోవటం ఓ సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. చేపల్ని పట్టుకునే ఈ పనిని ఓ పండుగలా నిర్వహిస్తున్నారు. ఈ పండుగ చేపల్ని పట్టుకోవటం కోసం మాత్రం కాదు. ఈ వేడుకలో ఓ పర్యావరణ హితం ఉంది. చిన్నాపెద్దా చేపలు పట్టుకుని ఈ ‘ఎకో ఫెస్టివల్’వెనుక ఓ కథ ఉంది.

Kashnir fish Catch fest : కశ్మీర్‌లో ఫిషింగ్ ఫెస్టివల్ .. నీటి వనరుల శుద్ధి కోసం  ఎకో ఫెస్టివల్ సంప్రదాయం

Kashnir fish catch fest

Kashnir fish catch fest : కశ్మీర్‌లోని ఓ ఊళ్లో ప్రతి ఏటా ఫిషింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ వెనుక సంప్రదాయం ఉంది. ఓ పర్యావరణహితం కోసం చేసే పని ఉంది. అందరు కలిసి చేపలు పట్టటం వెనుక ఓ టీమ్ వర్క్ ఉంది. ఈ ఫెస్టివల్ వెనుక ఉద్ధేశం చేపలు పట్టటం కాదు. కానీ చేపలు పడతారు. కానీ అది ఓ మంచి కోసం. ఈ ఫిషింగ్ ఫెస్టివల్ ఎందుకు నిర్వహిస్తున్నారు? దానికి.. ఊళ్లో వాళ్లే కాకుండా.. జిల్లా నలుమూలల నుంచి ఎందుకు తరలివస్తున్నారు? అనే విషయం తెలుసుకుందాం.

 

ఊళ్లో ఉన్న జనమంతా.. తట్టా, బుట్టా తీసుకొని.. నీళ్లలోకి దిగిపోతారు. సౌత్ కశ్మీర్‌లోని పంజాత్ గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది ఈ ఫిషింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. గ్రామస్తులతో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లంతా.. ఇలా నీళ్లలోకి దిగిపోయి చేపలు పట్టడంలో బిజీగా ఉంటారు. పంజాత్ గ్రామ వాసులు.. తమ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కనిపెట్టిన మార్గమే ఈ ఫిషింగ్ ఫెస్టివల్. గ్రామంలో ప్రతి సంవత్సరం ఈ చేపల వేట ఉత్సవం నిర్వహిస్తారు.

Strange Tradition : ఆ ఊరిలో వింత సంప్రదాయం..ఒకరికొకరు తాళి కట్టుకునే వధూవరులు

దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. చేపల కోసం ఫిషింగ్ రాడ్‌లులాంటివి ఉపయోగించరు. ప్లాస్టిక్‌ బుట్టలు గానీ, వెదురు బుట్టలు గానీ వాడతారు. ఈ బుట్టలను నీటిలో ముంచుతారు. వాటిలోకి వచ్చిన వ్యర్థాలను ఒడ్డున పారేస్తారు.ప్లాస్టిక్ లాంటివాటిని నీటినుంచి తీసి వేరుచేస్తారు. చెత్త బయటకు తీసే క్రమంలో కొందరికి చేపలు కూడా దొరుకుతాయ్.నీటి వనరుల్ని శుభ్రం చేయటం కోసం నిర్వహించే ఎకో ఫెస్టివల్ ఊరి వాళ్లనే కాదు.. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల్ని, జిల్లా వాసుల్ని బాగా ఆకట్టుకుంది.

 

ఒకప్పుడు.. కేవలం ఈ పంజాత్ గ్రామానికి చెందిన వాళ్లు మాత్రమే ఈ ఫిషింగ్ ఫెస్టివల్‌లో పాల్గొనేవారు. ఇప్పుడు.. అనంతనాగ్ జిల్లా నలుమూలల నుంచి జనం.. సైన్యంలా తరలివస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. అంతా ఇలా చేపలు పట్టేందుకు వచ్చేస్తుంటారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు రావడంతో.. ఈ కార్యక్రమం ప్రజాదరణ పొందింది.

 

ఈ ఫిషింగ్ ఫెస్టివల్‌కు వస్తున్న జనాదరణను దృష్టిలో ఉంచుకొని.. స్థానికులంతా.. పంజాత్ గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలని భావిస్తున్నారు. ఇటీవలే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ఈ పంజాత్ గ్రామం గురించి ప్రస్తావించారు. ఈ స్థలాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని.. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. ఈ ప్రాంతం.. గేట్ వే టు కశ్మీర్ అయిన ఖాజిగుండ్‌కు.. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ గ్రామంలో ఉన్న చెరువులు, కుంటలు.. రెండు గ్రామాల ప్రజలకు తాగు నీటితో పాటు సాగు నీరు కూడా అందిస్తున్నాయ్. అందుకే.. ఈ నీటి వనరులను.. క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం సంప్రదాయంగా భావిస్తున్నారు.

Sink hole in China : చైనాలో బయటపడ్డ అతిపెద్ద సింక్ హోల్..దాంట్లో అందమైన అడవి