Flies problem in Village : ద్యావుడా..! ఈగల వల్లే ఆ ఊర్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావటంలేదట.!!
ఆ గ్రామంలో అబ్బాయిలకు వివాహాలు కావటంలేదు. దీనికి కారణం ఈగలు అంటే నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.. ఈగల వల్ల ఆ గ్రామంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావటంలేదు.పెళ్లి అయినవారికి బెదిరింపులు తప్పటంలేదు.

Unmarried youths to fly problem
UP village Flies problem : ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘ఈగ’సినిమాలో ప్రధాన పాత్రధారి ఈగ విలన్ కు ఎలా చుక్కలు చూపించిందో ఆఖరికి అతనిని ఎలా అంతమొందించిందో చూశాం. కానీ ఓ ఊర్లో ఈగలు ఎంత పనిచేశాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈగల వల్ల ఆ ఊర్లో అబ్బాయిలకు పెళ్లిళ్లే కావటంలేదట. మీదో ఈగల ఊరు..మా పిల్లను ఎలా ఇచ్చేది? అని అడుగుతున్నారట అబ్బాయిలకు సంబంధాల కోసం వెళితే..! ఇంతకీ ఈ ‘ఈగ’ల గోలేంటీ..ఈ అబ్బాయిల పాట్లు ఏంటీ..ఏమా ఈగల కథ అంటే ఆ గ్రామంలో అందరు ముక్త కంఠంతో చెబుతారు..‘ఈ ఈగల బాధ పడలేకపోతున్నాం బాబోయ్’అని..
అది ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలోని రుద్వార్ అనే గ్రామం. ఈగ్రామం నిండా ఎక్కడ చూసినా ఈగల మోతే. రయ్ మంటూ ఊగల మోతెక్కిపోతోంది ఊరు ఊరంతా. ఈ ఈగల దండయాత్రతో జనాలు కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు. కడుపు నిండా తినలేకపోతున్నారు. కనీసం భోజనం చేద్దామని కంచంలో ఆహారం పెట్టుకుంటే చాలు దాన్నిండా కూడా ఈగలు ముసిరేస్తున్నాయి. దీంతో భోజనం మీద కూడా దోమ తెరలు వేసుకుని తినాల్సి వస్తోందట..ఆగ్రామంలో ఎవరింటికీ కూడా కనీసం బంధువులు కూడా రావటంలేదట. ఈ ఈగల బాధ నుంచి తప్పించుకోవటానికి ఎన్ని రకాల పురుగు మందులు, కీటకనాశినులు వాడుతున్నా.. ఈగల సంఖ్య పెరుగుతుందే ఏమాత్రం తగ్గడం లేదట.
Tomato Song Viral : ధర తగ్గని టమాటా .. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న పాట
ఈ ఊర్లో అబ్బాయిలకు కనీసం ఎవ్వరు పిల్లనివ్వటానికి కూడా ముందుకు రావటంలేదట. దీంతో పెళ్లి కాని అబ్బాయిల పాలిట ఈగలు ఆగర్భ శత్రువల్లా తయారయ్యాయి. పెళ్లి సంబంధాల కోసం వెళితే మీ ఊరినిండా ఈగలేకదా..మా పిల్లను ఎలా పంపించేది అని ముఖంమీద అడిగేస్తున్నారట..దీంతో అబ్బాయిల పాలిట విలన్ లా మారాయి.
ఇంతకీ ఈ గ్రామంలో ఈగలు అంతగా పెరిగి పోవటానికి కారణం ఏమిటంటే..కోళ్ల ఫారాలు. గ్రామంలో రోజు రోజుకు పెరుగుతున్న పౌల్ట్రీ ఫాం వ్యాపారమేనంటున్నారు స్థానికులు. కరోనాకు ముందు అక్కడ సాధారణ గ్రామాల్లానే ఏదోక పనిచేసుకునేవారు. కానీ కరోనా తరువాత గ్రామస్తులు ఎక్కువగా కోళ్ల ఫారాలవైపు మొగ్గు చూపారు. లాభాలు కూడా బాగానే ఉండటంతో అందరు అదే వ్యాపారం చేస్తున్నారు. దీంతో గ్రామంలో కోళ్ల ఫారాలు ప్రారంభించినప్పటి నుంచి అపరిశుభ్రత, దుర్వాసన పెరిగి… ఈగలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతంది కోళ్ల ఫారాల వ్యాపారులు నిర్లక్ష్యం, సరైన నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రత వల్ల ఈ సమస్య ఎక్కువైపోతోంది.
దాదాపు ఐదు వేల జనాభా ఉన్న గ్రామంలోని ప్రజలు దోమ తెరలు వాడుతున్నారు. కనీసం ఆహారం తినాలన్నా తెరల లోపలే తినాల్సి వస్తోంది. ఇన్ని పాట్లు పడుతున్నా ఆ గ్రామంలో పౌల్ట్రీ ఫామ్‌లను తొలగించేందుకు ఎవరు ముందుకు రావటంలేదు. నిజానికి కోళ్ల ఫారాలు గ్రామం శివార్లలో ఉండాలి. అది కూడా ఆయా ప్రాంతాల్లో నివసించే జనాభా సంఖ్యలు బట్టి ఫైల్ట్రీలు ఉండాలి. కానీ రుద్వార్ గ్రామస్తులు ఇష్టానుసారంగా ఫైల్ట్రీలు నిర్మించేస్తుండటంతో ఈగల సమస్య పెరుగుతోంది తప్ప ఏమాత్రం తగ్గటంలేదు. ఊరు ఊరంతా అదే వ్యాపారం. అదికూడా గ్రామ శివార్లలో కాదు ఇళ్ల మధ్యలోనే ఇలా ఫారాలు ఉండటం వల్ల సమస్య నానాటికి పెరుగుతోంది తప్ప ఏమాత్రం తగ్గటంలేదట..
ఈగల కారణంగానే ఆ గ్రామంలో యువకులు పెళ్లిళ్లు కావటంలేదు. చేసుకున్నవారు కూడా భార్యల ఒత్తిడితో వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారట. వేరే ప్రాంతానికి కాపురాలకు రాకపోతే విడాకులు అయినా ఇచ్చేస్తాం గానీ ఈ ఊర్లో మాత్రం కాపురం చేసేది లేదని తేల్చి చెప్పేస్తున్నారట.
ఈ ఈగల సమస్య వల్ల ప్రాణాలు కూడాపోతున్నాయి. అయినా ఈ వ్యాపారం మాత్రం మానటంలేదు గ్రామస్తులు. అధికారులకు ఈగల సమస్య గురించి ఫిర్యాదు చేస్తే జాగ్రత్తలు తీసుకోవటం మానేసి ఇష్టానుసారంగా ఇలా ఇళ్ల మధ్య కూడా ఫారాలు పెట్టేస్తుంటే మేం ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారట. ఈగల సమస్యతో అంటు వ్యాధులు ప్రబలి గత సంవత్సరంలో గ్రామంలో దాదాపు 10మంది వరకు చనిపోయారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు.