Tomato Song Viral : ధర తగ్గని టమాటా .. ఇంటర్నెట్‌లో‌ వైరల్ అవుతున్న పాట

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు వీటిని కొనే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు. ఇంటర్నెట్‌లో మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా టమాటా సాంగ్ వైరల్ అవుతోంది.

Tomato Song Viral : ధర తగ్గని టమాటా .. ఇంటర్నెట్‌లో‌ వైరల్ అవుతున్న పాట

Tomato Song Viral

Tomato Song Viral : ఉల్లిపాయ తరిగితే కళ్ల నీళ్లు వస్తాయి. కానీ టమాటా ధరలు వింటే కన్నీరు వస్తోంది. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా టమాటా ధరలు 100 నుంచి 200 వరకూ పలుకుతుండటంతో సామాన్యుడు విలవిలాడుతున్నాడు. పెరిగిన టమాటా ధరలపై రకరకాల మీమ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ టమాటా పాట అందర్నీ ఆకట్టుకుంది.

Tomato Price : టమాటా ధరలకు రెక్కలు.. కిలో రూ. 250, ఎక్కడంటే?

టమాటా లేని సాంబార్.. పావ్ బాజీ.. చికెన్ కర్రీ, సూప్ దేన్నైనా ఊహించగలమా? వాటికి రుచి వస్తుందా? అసలు టమాటా లేకుండా వంట అవ్వదే.. అంత డిమాండ్ ఉన్న టమాటా ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు టమాటా ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లుంది. సామాన్యుడు మర్చిపోయే పరిస్థితిలో ఉంది. దేశ వ్యాప్తంగా టమాట ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

 

కోల్ కతాలో అత్యధికంగా కిలో రూ.152, ఢిల్లీలో రూ.120, చెన్నైలో రూ.117, ముంబయిలో రూ.108 ధర పలుకుతోంది. గురుగ్రామ్ లో కిలో రూ.140, బెంగళూరులో రూ.110, వారణాసిలో రూ.107, హైదరాబాద్ లో రూ.98, భోపాల్ లో రూ.90 గా ఉంది. ఓ వైపు టమాటా పంటలు సైతం దొంగలు ఎత్తుకెళ్తున్నారు. బేలూరులోని పొలం నుండి రూ.2.7 లక్షల విలువైన టమాటా పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇటు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని ఓ దుకాణంలో 20 కిలోల టమాటాలు చోరీకి గురయ్యాయట. ఇది పరిస్థితి.

Tomato Theft : కర్ణాటకలో రూ.2.5 లక్షలు విలువ చేసే టమాటా చోరీ

ఇక పెరిగిన టమాటా ధరలపై ఇంటర్నెట్‌లో వీడియోలు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా viralbhayani అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన టమాటా పాట వైరల్ అవుతోంది. టమాటా లేని వంటకాల్ని అది కొనలేకుండా ఉన్న పరిస్థితిని అద్దం పడుతూ కొందరు కుర్రాళ్లు పాటకు స్టెప్పులు వేస్తారు. ఈ పాట విశాల్ నటించిన ‘ఎనిమి’ ఆల్బమ్ లోని ‘టమ్ టమ్’ ట్యూన్‌కు సాహిత్యాన్ని జోడించారు. ఇకనైనా టమాటా ధరలు దిగి వచ్చి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే రోజు రావాలని అందరూ కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)