Praggnanandhaa: నిన్ను చూసి గర్విస్తున్నా.. యువ చెస్ సంచలనం ప్రజ్ఞానందకు ప్రధాని మోదీ అభినందనలు .. ఫొటోలు వైరల్
ఫిడె వరల్డ్ కప్- 2023లో రన్నరప్‌గా నిలిచిన యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద తల్లిదండ్రులు రమేశ్ బాబు, నాగలక్ష్మిలతో కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఈ సందర్భంగా మోదీ ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులను అభినందించారు. కొద్దిసేపు వారితో ప్రధాని మోదీ ముచ్చటించారు. ప్రజ్ఞానందను తన కుటుంబంతో సహా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. పట్టుదల, తపనకు నిదర్శనం నువ్వు.. భారత యువత ఎందులో అయినా ఆధిపత్యం చలాయించగలరనడానికి నువ్వే ఉదాహరణ. నిన్ను చూసి గర్విస్తున్నా అని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సభ్యులతో కలిసి కలుసుకున్న సందర్భంగా దిగిన ఫొటోలను ప్రజ్ఞానంద తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. థాక్యూ సర్ మీరు మాట్లాడిన మాటలు తనను, తన తల్లిదండ్రులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా మోదీకి ప్రజ్ఞానంద కృతజ్ఞతలు తెలిపారు.





