2లక్షల కోట్ల మేర ఏపీ బడ్జెట్…సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత

మార్చి 6 వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బడ్జెట్‌ 2 లక్షల కోట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 1, 2020 / 02:36 AM IST
2లక్షల కోట్ల మేర ఏపీ బడ్జెట్…సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత

మార్చి 6 వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బడ్జెట్‌ 2 లక్షల కోట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.

మార్చి 6 వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈసారి బడ్జెట్‌ 2 లక్షల కోట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. గొప్పలకు పోకుండా వాస్తవాలకు దగ్గర బడ్జెట్‌ రూపొందించే పనిలో పడింది ఆర్థికశాఖ. గతంలోలాగే ఈసారి కూడా సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు జరిగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ధ్రప్రదేశ్ రాష్ట్ర 2020-21 బడ్జెట్ దాదాపు సిద్ధం అయింది. సుమారు 2లక్షల కోట్ల మేర బడ్జెట్ రూపొందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కన్నా ఇది తక్కువే ఉండవచ్చని తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు ఓట్ ఆన్ అకౌంట్‌కు దరిదాపుల్లోనే 2 లక్షల 27 వేల 974 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రతిపాదించారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక నెల మాత్రమే ఇండగా ఇంతవరకూ సుమారు 1.60 లక్షల కోట్లే ఖర్చు చేశారు. 

అంచనాలు, వాస్తవస్వరూపం మధ్య చాలా వ్యత్యాసం 
ఆశించిన స్థాయిలో ఆదాయాలు రాకపోవడం, కేంద్రం నుంచి వస్తాయనుకున్న నిధులు అందకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాలు, వాస్తవస్వరూపం మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈనేపథ్యంలో గత ఏడాది కన్నా బడ్జెట్ ను పెంచాలన్న ప్రతిష్టకన్నా… వాస్తవ పరిస్థితుల ఆదారంగానే ముందుకు వెళ్లాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం పెద్దలు నిర్దేశించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ 2 లక్షల కోట్ల లోపే ఉండే అవకాశం కన్పిస్తోంది. డ్జెట్ ప్రతిపాదన దశల్లోనే కొన్ని అంశాల్ని మినహాయించే పరిస్థితులు కన్పిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం నుంచి రెవెన్యూ లోటు 15వేల కోట్ల వరకూ రావాల్సి ఉందని, ప్రతి ఏడాది బడ్జెట్ లో ఆదాయంగా చూపుతున్నారు. ఆ నిధులు రాకపోవచ్చన్న అంచనాకు రావడంతో తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో దాన్ని మినహాయించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ప్రతి ఏడాది కేంద్రసాయం రూపంలో పెద్దమొత్తంలో ప్రతిపాదిస్తున్నారు. 

గణనీయంగా తగ్గిన రాష్ట్ర ఆదాయం  
దాదాపు మూడేళ్లుగా అంచనాకు, వాస్తవానికి మధ్య పొంతన ఉండటం లేదు. దీంతో ప్రస్తుతం కేంద్ర సాయం రూపంలో చూపే మొత్తాలు బాగా తగ్గవచ్చు. వివిధ కారణాలతో రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. కేంద్ర ప్రయోజిత పథకాల పేరుతో చూపే కేటాయింపులూ ఈసారి తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఈ అన్నింటి నేపథ్యంలో రాబడులు తగ్గి అంచనాల్లోనూ బాగా మార్పులు రానున్నాయని సమాచారం. రాష్ట్రం నుంచి వచ్చే పన్నులు, పన్నుయేతర సొంత ఆదాయం దాదాపు ఏడాది మొత్తం ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే సరిపోవచ్చని అంచనా. మొత్తం ఆదాయం దాదాపు 70 వేల కోట్ల వరకూ ఉంటుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. టిక్కెట్ల రూపంలోనూ, ఇతర మార్గాల్లో ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం పోగా మరో 1100 కోట్ల వరకూ జీతాలకే అదనంగా చెల్లించాల్సి వస్తోంది. విద్యావాలంటీర్ల వేతనాలు, కొత్తగా వచ్చిన సచివాలయాల ఉద్యోగులకు చెల్లించే జీతాల ప్రభావం ప్రస్తుతం ఏడాదితో పోలిస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం
ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటికి 45 వేల కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు చెపుతున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఇది 65 కోట్ల వరకూ చేరే అవకాశం ఉందంటున్నారు. ఇక ప్రతినెలా వడ్డీలు, అసలు పోతే ప్రాజెక్టులు, ఇతరత్రా కీలక రంగాలకు వెచ్చించే నిధుల కోసం రుణాలపై ఆధారపడాల్సిందే. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఆరంభం అయ్యాయని అంటున్నారు.