Chirag Paswan: బీజేపీతోనే చిరాగ్ పాశ్వాన్, ప్రచారం కూడా చేస్తారు.. బిహార్ బీజేపీ చీఫ్

ఈ విషయమై బిహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ స్పందిస్తూ ‘‘ఆర్జేడీ కార్యకర్తలు ఎల్‭జేపీ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. వారి దుకాణాలను ధ్వంసం చేస్తామని హెచ్చరికలు పంపుతున్నారు. వారికి అండగా మేం ఉంటాం. చిరాగ్ మాతో పాటే ఉంటారు. ఎన్డీయేలోనే ఉంటారు. ఎన్డీయే కోసం ప్రచారం చేస్తారు. మొకామా, గోపాల్ గంజ్ నియోజకవర్గాల్లో నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తారు’’ అని అన్నారు

Chirag Paswan: బీజేపీతోనే చిరాగ్ పాశ్వాన్, ప్రచారం కూడా చేస్తారు.. బిహార్ బీజేపీ చీఫ్

Chirag Paswan With NDA says BJP Bihar Chief

Chirag Paswan: లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఎటువైపు అనే విషయాన్ని బిహార్ భారతీయ జనతీయ జనతా పార్టీ శుక్రవారం స్పష్టం చేశారు. ఎన్డీయేలోనే చిరాగ్ ఉంటారని, ఎన్డీయే కోసం ప్రచారం కూడా చేస్తారని ఆయన అన్నారు. వాస్తవానికి 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కలిసి పోటీ చేశాయి. అయితే చిరాగ్ ఒంటరిగా పోటీ చేశారు. అయినప్పటికీ.. ఇదంతా బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందని, నితీశ్‭ను దెబ్బకొట్టడానికే చిరాగ్‭ను ఇలా పోటీకి దింపారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి.

ఇక కొద్ది రోజుల క్రితం బీజేపీకి నితీశ్ గుడ్ బై చెప్పేసి.. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసింది. బీజేపీతో కలవడానికి చిరాగ్‭కు ఇంతకాలం నితీశ్ అడ్డుగా ఉన్నారు. ఒక వైపు నితీశ్‭తో ఉంటూనే మరొకవైపు చిరాగ్‭తో బీజేపీ మిత్ర వైఖరి ప్రదర్శించింది. ప్రస్తుతం నితీశ్ లేకపోవడంతో ఇక ఇరు పార్టీలు అధికారికంగా కలిసే అవకాశం ఉన్నట్లు ముందు నుంచే ఊహగాణాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే చిరాగ్ తమతోనే ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది.

ఈ విషయమై బిహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ స్పందిస్తూ ‘‘ఆర్జేడీ కార్యకర్తలు ఎల్‭జేపీ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. వారి దుకాణాలను ధ్వంసం చేస్తామని హెచ్చరికలు పంపుతున్నారు. వారికి అండగా మేం ఉంటాం. చిరాగ్ మాతో పాటే ఉంటారు. ఎన్డీయేలోనే ఉంటారు. ఎన్డీయే కోసం ప్రచారం చేస్తారు. మొకామా, గోపాల్ గంజ్ నియోజకవర్గాల్లో నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తారు’’ అని అన్నారు. అయితే రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు అయిన పశుపతి కుమార్ పారాస్‭కు బీజేపీ దూరంగా ఉంటోంది. పార్టీ రెండుగా విడిపోయాక.. చిరాగ్ కూటమితోనే చెలిమి చేస్తోంది.

Shocking Video: షాకింగ్ వీడియో.. బైక్ అడ్డుందని వాగ్వాదం.. ముగ్గురిపై నుంచి కారు ఎక్కించిన వ్యక్తి