Shocking Video: షాకింగ్ వీడియో.. బైక్ అడ్డుందని వాగ్వాదం.. ముగ్గురిపై నుంచి కారు ఎక్కించిన వ్యక్తి

ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో జరిగిందీ దారుణం. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీటీవీ పుటేజీ ప్రకారం.. రోడ్డుకు కాస్త పక్కన ఒక వ్యక్తి బైకుపై ఆగి ఉన్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి బైకుకు మెల్లిగా డాష్ ఇచ్చింది. అనంతరం కారులో నుంచి ఒక వ్యక్తి దిగి బైకుపై ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో కొంత మంది యువకులు అక్కడికి చేరుకున్నారు

Shocking Video: షాకింగ్ వీడియో.. బైక్ అడ్డుందని వాగ్వాదం.. ముగ్గురిపై నుంచి కారు ఎక్కించిన వ్యక్తి

CCTV footage shows man running car over 3 people after argument with biker in Delhi

Shocking Video: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా బైక్ ఉందని కారులో వచ్చిన ఒక వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. బైకరుతో పాటు మరి కొంత మంది యువకులు కారులోని వ్యక్తితో కాసేపు మాటల యుద్ధం చేశారు. ఇక గొడవ సర్ధుమనుగుతుందనుకున్న సమయంలో.. దారుణం జరిగింది. అక్కడి నుంచి వెళ్తున్నట్లే వెళ్తూ యువకులపై నుంచి కారు ఎక్కించాడు. కారు టైర్ల కింద ముగ్గురు వ్యక్తులు చిక్కకున్నారు. అయితే ముగ్గురిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో జరిగిందీ దారుణం. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీటీవీ పుటేజీ ప్రకారం.. రోడ్డుకు కాస్త పక్కన ఒక వ్యక్తి బైకుపై ఆగి ఉన్నాడు. ఇంతలో ఒక కారు వచ్చి బైకుకు మెల్లిగా డాష్ ఇచ్చింది. అనంతరం కారులో నుంచి ఒక వ్యక్తి దిగి బైకుపై ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో కొంత మంది యువకులు అక్కడికి చేరుకున్నారు. వారితో కూడా కారులోని వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఒకరిద్దరు కుమ్ములాటకు సై అన్నట్లుగా ముందుకు వస్తే.. స్థానికులు వారిని వారించి నిలువరించారు. ఇక కారులో వచ్చిన వ్యక్తి.. కారును స్టార్ట్ చేశాడు. అతడు అక్కడి నుంచి వెళ్తున్నాడు అనుకున్నారంతా. అనూహ్యంగా ఒక చోట నిల్చున్న యువకుల మీదకు కారును పోనిచ్చాడు.


యువకుల మీదకు ఎక్కిన కారు కాస్త ఆగింది. అప్పటికే అక్కడ గుమిగూడి గొడవను చూస్తున్నవారు.. పరుగు పరుగున అక్కడికి వచ్చే లోపు, అతడు కారును ముందుకు పోనిచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 307 (హత్యానేరం) కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

Elon Musk Twitter Takeover: య‌జ‌మానులు ఎవ‌రైనా స‌రే.. దేశ చ‌ట్టాల‌ను అనుస‌రించాల్సిందే.. స్ప‌ష్టం చేసిన భార‌త్‌