AAP: కేజ్రీవాల్‭కు ఝలక్.. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఆటోవాలా, బీజేపీకి యూటర్న్

దీనిని అదునుగా చూసి ఆప్‭పై బీజేపీ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. తమ పార్టీ సానుభూతి పరులను డబ్బులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని, కానీ అది సాధ్యం కాదంటూ కేజ్రీవాల్‭పై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం మొదటి దశలోనే ఉంది. బీజేపీ ఎంత మేరకు దీన్ని వివాదంగా మారుస్తుంది? దానికి ఆప్ ఎలా బదులిస్తుందనేది చూడాలి.

AAP: కేజ్రీవాల్‭కు ఝలక్.. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఆటోవాలా, బీజేపీకి యూటర్న్

gujarat autowala who invited kejriwal to his home for dinner is bjp worker

AAP: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి ఉత్సహంతో గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏమాత్రం తీసిపోకుండా రోజువారి ప్రచారాలతో దూసుకుపోతోంది. కొద్ది రోజుల క్రితం హైడ్రామా నడుమ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‭లో ఒక ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి కేజ్రీవాల్ భోజనం చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఆప్‭కు అత్యంత ప్రచారాన్ని ఇచ్చిన ఈ ఘటన.. తాజాగా ఆప్‭ను చిక్కుల్లో పడేసేట్టుగా కనిపిస్తోంది. కారణం.. ఆ ఆటో ట్రైవర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావడం.

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వీరాభిమాని అయిన సదరు ఆటోవాలాకు డబ్బు ఆశ చూపించి కేజ్రీవాల్ ఈ స్టంట్ చేశారట. బీజేపీ గుజరాత్ మీడియా అధినేత జుబిన్ ఆష్రాతో కలిసి సదరు ఆటోవాలా ఓ వీడియోలో మాట్లాడారు. ఆప్ నేతలు తనకు డబ్బు ఇచ్చారని, ఆ డబ్బు ఆశతోనే అందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆ వీడియాలో చెప్పుకొచ్చాడు. తాను చిన్నప్పటి నుంచి నరేంద్రమోదీకి అభిమానినని, కేవలం డబ్బు కోసమే ఆప్ నేతలు చెప్పమన్నట్లు చెప్పానని చెప్పాడు విక్రమ్ దంతాని అనే ఆటోవాలా.

దీనిని అదునుగా చూసి ఆప్‭పై బీజేపీ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. తమ పార్టీ సానుభూతి పరులను డబ్బులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని, కానీ అది సాధ్యం కాదంటూ కేజ్రీవాల్‭పై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం మొదటి దశలోనే ఉంది. బీజేపీ ఎంత మేరకు దీన్ని వివాదంగా మారుస్తుంది? దానికి ఆప్ ఎలా బదులిస్తుందనేది చూడాలి.

Congress President Poll: నామినేషన్ వేసిన అనంతరం గాంధీ కుటుంబంపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు