ప్రభుత్వ స్థలంలో ఇల్లు ఉందా..అయితే మీకు పట్టా – ఎర్రబెల్లి

  • Published By: madhu ,Published On : March 1, 2020 / 11:09 AM IST
ప్రభుత్వ స్థలంలో ఇల్లు ఉందా..అయితే మీకు పట్టా – ఎర్రబెల్లి

ప్రభుత్వ స్థలంలో ఇల్లు ఉందా ? అయితే..మీకో గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జోరుగా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు వారి వారి నియోజకవర్గాల్లో మకాం వేస్తూ..పథకాన్ని సమీక్షిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2020, మార్చి 01వ తేదీ ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

బంగారు తెలంగాణగా మార్చాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని, నర్సంపేట అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు నిధులు ఇచ్చామన్నారు. దీనికి తగ్గట్టు వార్డుల్లో పారిశుధ్యం నిర్వాహణ ఉండాలని సూచించారు. పట్టణంలో విరివిగా మొక్కలు నాటాలని, ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ చట్టంలో మార్పులు చేశామన్నారు. ఇక ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలిస్తామని ప్రకటించారు. పట్టణ ప్రగతి 100 శాతం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 04 వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

Read More : తిరుపతి – తిరుమల లైట్ మెట్రో రైలు సాధ్యమేనా ?