కోడెల మృతికి చంద్రబాబే కారణం : లెటర్ రాశారేమోనని వణికిపోయారు

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కోడెలది

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 06:52 AM IST
కోడెల మృతికి చంద్రబాబే కారణం : లెటర్ రాశారేమోనని వణికిపోయారు

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కోడెలది

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కోడెలది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వమే కోడెలను చంపేసిందని అంటున్నారు. దీనికి అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కోడెల మృతికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. చంద్రబాబు తీరు వల్లే కోడెల మానసికంగా కుంగిపోయారని చెప్పారు. కోడెల మృతి చెందిన ఐదారు గంటల వరకు చంద్రబాబు మాట్లాడలేదన్నారు. కోడెల లెటర్ ఏమన్నా రాశారేమోనని చంద్రబాబు వణికిపోయారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. టీడీపీలో కోడెలను పక్కనపెట్టడం వల్లే ఆయన మానసికంగా కుంగిపోయారని అన్నారు.

బతికున్నప్పుడు హింసించి.. ఇప్పుడు శవ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గుంటూరులో ఓ వర్గాన్ని ప్రోత్సహించి.. కోడెలను కుంగదీశారని ఆరోపించారు. ఈ పరిణామాలతో కోడెల కుంగిపోయారని వాపోయారు. కోడెల ఇబ్బందులు పడుతున్న సమయంలో చంద్రబాబు.. ఆయనను దగ్గరకు కూడా రానివ్వలేదన్నారు. కోడెల మానసిక క్షోభ అనుభవిస్తుంటే కనీసం ధైర్యం కూడా చెప్పలేదన్నారు. 3 నెలల్లో ఒక్కరోజైనా కోడెలను చంద్రబాబు పరామర్శించారా అని ప్రశ్నించారు.

చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. శవ రాజకీయాలు టీడీపీకి అలవాటే అన్నారు. కోడెల చనిపోయిన విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండానే టీడీపీ రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు. కోడెల ఫర్నీచర్ చోరీ చేసి ఉండకూడదని టీడీపీ నేతలు అన్నారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే పతనం తప్పదని చంద్రబాబుని హెచ్చరించారు.