మున్సి పల్స్ కారు టాప్ గేర్ : అందరికీ ధన్యవాదాలు : KTR

  • Published By: madhu ,Published On : January 25, 2020 / 10:03 AM IST
మున్సి పల్స్ కారు టాప్ గేర్ : అందరికీ ధన్యవాదాలు : KTR

మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు .. మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని నమ్మి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వరుస విజయాలు కట్టబెట్టారని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకూ ప్రతీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. అన్ని మున్సిపాల్టీల్లో దాదాపు వంద మున్సిపాల్టీల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిందని చెప్పారు. అలాగే పార్టీ గెలుపు కోసం నెలన్నర రోజులుగా నాయకులు చాలా కష్టపడ్డారని చెప్పారు. 

‘ముందుగా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీఎం కేసీఆర్‌ మీద నమ్మకం ఉంచారు. ఆయన నాయకత్వాన్ని బలంగా నమ్మారు. అందుకే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి విజయాల మీద విజయాలు సాధిస్తున్నాం. 2014 నుంచి ఇప్పటివరకూ ప్రతీ ఎన్నికల్లో విజయం సాధించాం. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, జిల్లాపరిషత్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించాం. ఇక కార్యకర్తలు, నాయకులు పార్టీకి ఘన విజయాన్ని అందించేందుకు నెలన్నర రోజులుగా చాలా కష్టపడ్డారు. అందుకే ఎన్నికల్లో స్వీప్‌ చేశాం’. అని చెప్పుకొచ్చారు. 

Read More : మున్సి పల్స్ : TRS జోరుకు కాంగ్రెస్, బీజేపీ బేజారు

కార్పొరేషన్ పార్టీ
నిజామాబాద్  
రామగుండం హంగ్
నిజాంపేట TRS
జవహార్ నగర్ TRS
ఫీర్జాదీగూడ TRS
బోడుప్పల్  TRS
బండ్లగూడ జాగీర్ TRS
బడంగ్ పేట TRS
మీర్ పేట  TRS