MLAs Return To Ranchi: జార్ఖండ్‭లో హైటెన్షన్.. రాయ్‭పూర్ నుంచి తిరుగు ప్రయాణమైన జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ అసోసియేషన్‭కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు

MLAs Return To Ranchi: జార్ఖండ్‭లో హైటెన్షన్.. రాయ్‭పూర్ నుంచి తిరుగు ప్రయాణమైన జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

MLAs Return To Ranchi: జార్ఖండ్ అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఛత్తీస్‭గఢ్‭ రాజధాని రాయ్‭పూర్ నుంచి రాంచీకి తిరుగు ప్రయాణం అయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో వారంతా రాయ్‭పూర్ ఎయిర్‭పోర్ట్‭కి చేరుకున్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాల సందర్భంగా వీరంతా ఒక రోజు ముందుగానే స్వరాష్ట్రానికి తిరుగు ప్రయాణం కావడం గమనార్హం. సెప్టెంబర్ 5న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బలపరీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి వీరిని సోమవారమే తీసుకురావాలని ముందుగా నిర్ణయించినప్పటికీ.. బలపరీక్షకు ముందు ఒకసారి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే ఉద్దేశంతోనే ఆదివారం తరలిస్తున్నట్లు సమాచారం. దీంతో జార్ఖండ్‭లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.

బీజేపీ ఆపరేషన్ కమల్ చేపట్టిందనే ఆరోపణలతో జార్ఖండ్‭లో రాజకీయ గందరగోళం ఏర్పడింది. అధికార కూటమి(జార్ఖండ్ ముక్తి మోర్చీ, కాంగ్రెస్, ఆర్జేడీ) వెంటనే అప్రమత్తమై తమ ఎమ్మెల్యేలను హుటాహుటిన పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‭గఢ్ పంపించింది. ఆగస్టు 30న మొదటి టీంను పంపారు. అనంతరం మంత్రులు, ఇతర నేతలను సైతం రాయ్‭పూర్‭లోని ఒక లగ్జరీ రిసార్టుకు తరలించారు. అధికార కూటమిలోని నేతలపై భారతీయ జనతా పార్టీ హార్స్ ట్రేడింగ్ ప్రారంభించిందనే కారణంతో ఎమ్మెల్యేలను ఇలా పొరుగు రాష్ట్రంలో దాచక తప్పడం లేదని అంటున్నారు.

81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ అసోసియేషన్‭కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సోరెన్ గట్టెక్కుతారు. కానీ అధికార కూటమికి అంతకంటే ఎనిమిది మంది ఎక్కువే బలం ఉంది. అయినప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాల దృష్ట్యా ఏమైనా జరగొచ్చని అంటున్నారు.

Govt Business: ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదు.. బల్ల గుద్ది మరీ చెప్పిన మారుతీ చైర్మన్