IND vs SA : టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. అందరి చూపు కోహ్లీ వైపే

ఇప్పటికే టెస్టు సిరీస్‌లో ఓడిపోయిన టీమిండియా వ‌న్డే సిరీస్‌ను ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ సిరీస్‌లో అంద‌రి చూపు విరాట్ కోహ్లీపైనే ఉండ‌నుంది...

IND vs SA : టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. అందరి చూపు కోహ్లీ వైపే

Kohli

India tour of South Africa : కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లీ జట్టులో ఒక సాధారణ ప్లేయర్‌గా ఏడేళ్ల తర్వాత ఆడబోతున్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌లో ఓటమి చూసిన టీమిండియా 2022, జనవరి 19వ తేదీ బుధవారం నుంచి ఆరంభమయ్యే వన్డే సిరీస్‌లో ఏ మేరకు రాణిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ను ఎంచుకుంది. మలన్, డి కాక్ లు ఓపెనర్లుగా ఆటను ప్రారంభించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టు సారథ్య బాధ్యతలను విడిచిపెట్టిన తర్వాత ఆడబోయే మొదటి మ్యాచ్ అవుతుంది.

Read More : UP Elactions : ఓట్ల కోసం ఫీట్లు..మోడీ, యోగీ బొమ్మలతో చీరలు

జట్టులో ఒక సాధారణ ప్లేయర్‌గా ఏడేళ్ల తర్వాత కోహ్లీ ఆడుతుండడమే విశేషం. రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. దీంతో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు జట్టును నడిపించే చక్కని అవకాశం లభించింది. దీన్ని రాహుల్ సద్వినియోగం చేసుకుంటాడా అన్నది మరో ఆసక్తికర అంశంగా మారింది. ఈ విషయంలో కోహ్లీ సూచనలను తప్పకుండా తీసుకునే అవకాశం ఉంది. వన్డే సిరీస్‌ను గెలుచుకుంటే కనుక అది రాహుల్‌కు పెద్ద ప్లస్ అవుతుంది. ముందుముందు మంచి అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది.

Read More : ICMR : జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే మార్చి 11 తర్వాత సమూహ వ్యాప్తి తప్పదు!

సఫారీ గ‌డ్డపై ఇప్పటివ‌ర‌కు భార‌త్‌పై సౌతాఫ్రికాదే పై చేయిగా ఉంది. హోం గ్రౌండ్‌లో ఇప్పటివ‌ర‌కు భార‌త్‌పై సౌతాఫ్రికా 22 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. అదే టీమిండియా స‌ఫారీ గ‌డ్డపై సౌతాఫ్రికాను 10 సార్లు ఓడించింది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో ఓడిపోయిన టీమిండియా వ‌న్డే సిరీస్‌ను ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ సిరీస్‌లో అంద‌రి చూపు విరాట్ కోహ్లీపైనే ఉండ‌నుంది.