INDvsSA: 30ఏళ్లుగా టెస్టు సిరీస్ గెలవలేకపోయిన ఆరుగురు ఇండియన్ కెప్టెన్లు

టీమిండియా ఏడు వికెట్ల తేడాతో కేప్ టౌన్ వేదికగా మూడో టెస్టులో ఓటమికి గురైంది. దాంతో తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలని అనుకున్న కోహ్లీసేనకు నిరాశే మిగిలింది.

INDvsSA: 30ఏళ్లుగా టెస్టు సిరీస్ గెలవలేకపోయిన ఆరుగురు ఇండియన్ కెప్టెన్లు

Test Captains

INDvsSA: టీమిండియా ఏడు వికెట్ల తేడాతో కేప్ టౌన్ వేదికగా మూడో టెస్టులో ఓటమికి గురైంది. దాంతో తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలని అనుకున్న కోహ్లీసేనకు నిరాశే మిగిలింది. అయితే ఈ పరాభవం ఇప్పటిది కాదు. 30ఏళ్లుగా పడుతున్న తపన ఇది. 1992లో మొహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాకు వెళ్లిన జట్టుకు ఇదే జరిగింది.

ప్రస్తుత ఓటమి 2022
మ్యాచ్ డిసైడింగ్ కోసం సఫారీలకు నిర్దేశించిన టార్గెట్ 212 పరుగులు. చాలా సులువుగా 3వికెట్లతో నాలుగో రోజు ఆటలో విజయాన్ని సాధించారు. దీంతో ఆతిథ్య జట్టు 2-1తేడాతో యథావిధిగా గెలిచేసింది.

2018లో కోహ్లీ సేన
2017-18లోనూ ఇదే పరిస్థితి. కోహ్లీ కెప్టెన్సీలో ఇదే ఫలితం నమోదైంది. 2-1సిరీస్ తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది.

2014లో ధోనీ
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది టీమిండియా. ఆ సమయంలో టీమిండియా టెస్టు సిరీస్ ను 0-1తో ఓడిపోయింది.

ఇది కూడా చదవండి : కేరళలో కరోనా విలయం.. 9వ తరగతి వరకు స్కూళ్లు మూసివేత!

2010లో ఓడిపోలేదు
2010-11 సంవత్సరం టీమిండియా టెస్టు సిరీస్ ఓడిపోలేదు కానీ, గెలవలేకపోయింది. డ్రాగా ముగించి రిటర్న్ అయిపోయింది.

రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీల్లోనూ..
2006-07లో ద్రవిడ్ కెప్టెన్సీలో 1-2తో ఓటమికి గురైంది. 2001-02లొ గంగూలీ కెప్టెన్సీలో 0-1 ఇదే పరిస్థితి. 1996-97లోనూ సచిన్ కెప్టెన్సీలో 0-2తేడాతో ఓడిపోయింది.

1992లో అజారుద్దీన్
అజారుద్దీన్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా పర్యటన చేసిన టీమిండియా 0-1తేడాతో నాలుగు మ్యాచ్ లో టెస్టు సిరీస్ ను కోల్పోయింది.

IND vs SA: మాదే తప్పు.. అవకాశాలు వాడుకోలేకపోయాం – కోహ్లీ