Ravichandran Ashwin: అశ్విన్ లాంటి జీనియస్‌లు చాలా అరుదుగా వస్తారు – పాక్ మాజీ కెప్టెన్

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. జీనియస్ లలో ఒకడైన ఈ ఇండియన్ క్రికెటర్ చాలా విలువైన వ్యక్తి అంటున్నాడు.

Ravichandran Ashwin: అశ్విన్ లాంటి జీనియస్‌లు చాలా అరుదుగా వస్తారు – పాక్ మాజీ కెప్టెన్

Ravichandran Ashwin

Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. జీనియస్ లలో ఒకడైన ఈ ఇండియన్ క్రికెటర్ చాలా విలువైన వ్యక్తి అంటున్నాడు.

గ్రేటెస్ట్ స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ ఆటతీరు చాలా అందంగా ఉంటుంది. 2011లో వెస్టిండీస్ లో జరిగిన టెస్టుతో అరంగ్రేటం చేశాడు. గత దశాబ్దం మొత్తం అతనిదే హవా. లాంగ్ ఫార్మాట్ గేమ్ లో.. బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

అంతేకాకుండా అత్యంత వేగంగా 350టెస్టుల వికెట్లు తీసిన క్రికెటర్ గానే కాకుండా.. అదే జాబితాలో శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ (400 వికెట్లు) తర్వాత నిలిచాడు. రీసెంట్ గా ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత ఇండియా లీడింగ్ వికెట్ టేకర్ అశ్విన్ మాత్రమే.

బౌలర్ గా వికెట్లు పడగొట్టడమే కాకుండా ఐదు టెస్టు సెంచరీలు కూడా నమోదు చేశాడు. ‘అశ్విన్ అద్భుతమైన స్పిన్నర్. చాలా తెలివిగా బంతిని స్పిన్ చేస్తాడు. విభిన్నమైన యాంగిల్స్ లో ప్రయోగిస్తాడు. అలాంటి జీనియస్ లు చాలా అరుదుగా మాత్రమే వస్తారు. వాళ్లకు కచ్చితంగా విలువ ఇవ్వాలి’ అని పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నారు.

‘అశ్విన్ ఇదే ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ వస్తే ముత్తయ్య మురళీథరన్ రికార్డును బ్రేక్ చేసేయగలడు. పిచ్ వాతావరణానికి తగ్గట్టు బౌలింగ్ వైఖరి మార్చగల నేర్పరి. అనేక వైరైటీల్లో బౌలింగ్ వేస్తాడు. మెంటల్ గా స్ట్రాంగ్ మాత్రమే కాకుండా కెప్టెన్సీ కూడా చేయగలడు’ అని అశ్విన్ గురించి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొగిడేశాడు రమీజ్ రాజా.