Asia Cup 2022: మహ్మద్ నబీ సారథ్యంలో ఆసియా కప్‌కు.. 17మంది సభ్యులతో జట్టును ప్రకటించిన ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు

ఆసియా కప్-2022 టోర్నీ కోసం ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దేశ జట్టును ప్రకటించింది. 17మంది సభ్యులను ఈ జట్టులో ఎంపిక చేయగా.. ఈ జట్టుకు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ సారథ్యం వహించనున్నాడు

Asia Cup 2022: మహ్మద్ నబీ సారథ్యంలో ఆసియా కప్‌కు.. 17మంది సభ్యులతో జట్టును ప్రకటించిన ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు

Asia Cup 2022: ఆసియా కప్-2022 టోర్నీ కోసం ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ దేశ జట్టును ప్రకటించింది. 17మంది సభ్యులను ఈ జట్టులో ఎంపిక చేయగా.. ఈ జట్టుకు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ సారథ్యం వహించనున్నాడు. ప్రస్తుతం ఆప్గనిస్తాన్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. ఆ జట్టులో 16మంది సభ్యులు ఉన్నారు.. ఇప్పుడు రిజర్వ్ లలో భాగమైన షరాఫుద్దీన్ అష్రఫ్ స్థానంలో సమియుల్లా షిన్వారీ నియమితులయ్యారు. స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా జట్టులోకి వచ్చాడు. షిన్వారీ చివరిసారిగా మార్చి 2020లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆసియా కప్ టోర్నీ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరుగుతుంది. ఆగస్టు 17న ఆఖరి టీ20 మ్యాచ్ తో ఆఫ్గన్ జట్టు ఐర్లాండ్ పర్యటనను ముగించుకోనుంది.

India Squad For Asia Cup 2022 : ఆసియా కప్‌కు టీమిండియా ఎంపిక.. మళ్లీ జట్టులోకి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్

ఆసియా కప్‌-2022 టోర్నీకి అఫ్గనిస్తాన్‌ ప్రకటించిన జట్టులో.. మహ్మద్‌ నబీ(కెప్టెన్‌), రహ్మనుల్లా గుర్బాజ్‌(వికెట్‌ కీపర్‌), హజార్తుల్లా జజాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, హష్మతుల్లా షాహిది, అఫ్సర్‌ జజాయ్‌, కరీం జనత్‌, అజ్మతుల్లా ఓమర్జాయ్‌, సమియుల్లా షిన్వారీ, రషీద్‌ ఖాన్‌, ఫాజల్‌ హక్‌ ఫరూకీ, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, ఇబ్రహిం జర్దాన్, ఉస్మాన్ గని వీరితో పాటు రిజర్వు ప్లేయర్లుగా కైస్‌ అహ్మద్‌, షరాఫుద్దీన్‌ అష్రఫ్‌, నిజత్‌ మసూద్‌ ఉన్నారు.

ఆప్గనిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ నూర్ మాలిక్జాయ్ మాట్లాడుతూ.. ఆసియా కప్ మాకు చాలా ముఖ్యమైన టోర్నీ అన్నారు. ఈ టోర్నీ కోసం మేము అందుబాటులో ఉన్న మా అత్యుత్తమ ఆటగాళ్లను ఎంచుకున్నామని తెలిపారు. సమీవుల్లా షిన్వారీని ఆసియా కప్ కోసం జట్టులోకి చేర్చామని, అతను చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడని, ఇప్పటికే ఇబ్రహీం జద్రాన్, హష్మతుల్లా షాహిదీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీలతో బ్యాటింగ్ విభాగానికి మరింత ఊపునివ్వగలడని తెలిపారు.