Pant to Ashwin: అశ్విన్ భాయ్.. కోరిక తీర్చుకోవాలంటే ఇదే సరైన సమయం – పంత్

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ లోకి రవిచంద్రన్ అశ్విన్ తిరిగొచ్చేశాడు. నాలుగేళ్ల విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో కనిపించాడు.

Pant to Ashwin: అశ్విన్ భాయ్.. కోరిక తీర్చుకోవాలంటే ఇదే సరైన సమయం – పంత్

T20 World Cup 2021

Pant to Ashwin: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ లోకి రవిచంద్రన్ అశ్విన్ తిరిగొచ్చేశాడు. నాలుగేళ్ల విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో కనిపించాడు. దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో అక్టోబర్ 18న ఈ మ్యాచ్ జరిగింది. ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై టీమిండియా గెలుపొందగా రాహుల్, ఇషాన్ ల ప్రదర్శన హైలెట్ గా నిలిచింది.
.
మ్యాచ్ లో కీలకంగా వ్యవహరించి అతి తక్కువ పరుగులిచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అశ్విన్.. కేవలం 23పరుగులిచ్చాడు. ఈ సమయంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్.. అశ్విన్ ను ఎంకరేజ్ చేసేందుకు చేసిన మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి.

వేరియేషన్ కోసం అశ్విన్ లెగ్ స్పిన్ వేశాడు. 11వ ఓవర్ స్టార్టింగ్ లో.. జానీ బెయిర్ స్టో స్ట్రైక్ లో ఉండగా ఇది జరిగింది. ఇదే సరైన సమయం లెగ్ స్పిన్ వేసేయ్ అంటూ పంత్ మాటలు చెప్పడంతో అలాగే చేశాడు అశ్విన్.

…………………………………….: మరో వివాదంలో ఆర్జీవీ.. ఈటెల రాజేందర్ పై ఆర్జీవీ సినిమా

‘కోరిక తీర్చుకునేందుకు ఇదే సరైన సమయం. లెగ్ స్పిన్ వేయడానికి అవకాశం కూడా ఉంది’ అంటూ చెప్పిన మాటలు రికార్డ్ అయ్యాయి. హాఫ్ ట్రాకర్ బౌలింగ్ వేసిన అశ్విన్.. బెయిర్ స్టోకు సింగిల్ మాత్రమే ఇచ్చాడు.

మరోవైపు పంత్.. బ్యాటింగ్ లో డీసెంట్ ప్రదర్శన కనబరిచాడు. 14బంతులకు 29పరుగులు చేశాడు. 189పరుగులు లక్ష్యాన్ని క్రీజులో ఉండి సాధించాడు. అంతకంటే ముందు ఇషాన్ కిషన్ (70; 46బంతుల్లో), కేఎల్ రాహుల్ (51; 24బంతుల్లో)తో టార్గెట్ చేజింగ్ ఈజీ చేసేశారు.