India : ఆసియా జూ.బాక్సింగ్, పంచ్‌‌లతో అదరగొట్టారు..నాలుగు స్వర్ణాలు

ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. పంచ్ లతో ప్రత్యర్థులను మట్టికరిపించారు.

India : ఆసియా జూ.బాక్సింగ్, పంచ్‌‌లతో అదరగొట్టారు..నాలుగు స్వర్ణాలు

Boxing

Asian Boxing Championship : ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. పంచ్ లతో ప్రత్యర్థులను మట్టికరిపించారు. ఒకే రోజు నాలుగు స్వర్ణపతాలు గెలుచుకున్నారు. దుబాయి లో ఈ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో 2021, ఆగస్టు 29వ తేదీ ఆదివారం జరిగిన పోటీల్లో భారత క్రీడాకారులు పాల్గొన్నారు.

Read More : Tokyo Olympics Over : ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు…ఏఏ దేశాలు ఎన్ని పతకాలు సాధించాయంటే

బాలుర ఫైనల్ లో రోహిత్..తుషింజయ (మంగోలియా) క్రీడాకారుడితో తలపడ్డాడు. పదునైన పంచ్ లు విసురుతూ ప్రత్యర్థికి టైం ఇవ్వలేదు. దీంతో 3-2 తేడాతో తుషింజయపై రోహిత్ గెలుపొంది స్వర్ణపతకం గెలుపొందాడు. ఇక బాలికల విషయానికి వస్తే..48 కేజీల విభాగంలో ఫైనల్ లో రతీ – బక్తియరోవా (ఉబ్జెకిస్థాన్) తో తలపడింది. ఇందులో రతీ గెలుపొందారు.

Read More :ఐక్యరాజ్యసమితి ఆఫీస్ కారులో కామక్రీడలు.. వైరల్ గా మారిన వీడియో

52 కేజీల విభాగంలో తుది సమరంలో తమ్రీస్ (కజకిస్థాన్)పై తనూ విజయం సాధించారు. మొత్తంగా రోహిత్, భరత్ జూన్, విష్ణు రతీ, తనూలు స్వర్ణ పతకాలు గెలుపొందారు. 46 కేజీల విభాగంలో ముస్కాన్ – గనియెవా (ఉజ్బెకిస్థాన్) మధ్య పోటీ జరిగింది. ఇందులో ముస్కాన్ పరాజయం చెంది రజత పతకాన్ని సాధించారు. అలాగే..70 కేజీల విభాగంలో గౌరవ్ సైని 0-5తో బోల్తేవ్ (ఉబ్బెకిస్థాన్) చేతిలో పరాజయం చెంది రజత పతకం గెలుపొందాడు.