T20 World Cup 2021: ఓడిపోయిన మ్యాచ్‌లో రికార్డు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా!

బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

T20 World Cup 2021: ఓడిపోయిన మ్యాచ్‌లో రికార్డు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా!

Shakib

T20 World Cup 2021: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు షకీబ్ అల్ హసన్. శ్రీలంకతో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో పాతుమ్ నిశాంకను అవుట్ చేయడం ద్వారా షకీబ్ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు షకీబ్ టీ20 ప్రపంచకప్‌లో 28 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు పడగొట్టాడు.

ఒమన్‌పై నాలుగు వికెట్లు తీసిన షకీబ్, ఈ మ్యాచ్‌లో మొదట నిశాంకను అవుట్ చేశాడు. ఆ తర్వాత అవిష్క ఫెర్నాండోని అవుట్ చేసి 41వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అఫ్రిది 34 మ్యాచుల్లో 39 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షకీబ్ అగ్రస్థానంలో నిలిచాడు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఉండగా అఫ్రిదిని అధిగమించాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్. అయితే, షకీబ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మ్యాచ్‍ను బంగ్లాదేశ్ ఓడిపోయింది. షార్జాలో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

దీంతో 2014 చాంపియన్ శ్రీలంక 2021 టీ20 ప్రపంచకప్‌లో విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా ఆడిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేసింది. అనంతరం.. శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి ఏడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.