India vs South Africa ODI Series: వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ట్రోపీ అందుకొని తొడగొట్టిన శిఖర ధావన్.. ట్విటర్‌లో వీడియో పోస్టు చేసిన బీసీసీఐ

వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవటంతో భారత్ జట్టు కెప్టెన్ శిఖర ధావన్ ట్రోపీని అందుకున్నాడు. ఈ క్రమంలో తొడగొట్టి తన ఆనందాన్ని ప్రకటించాడు. అనంతరం టీం సభ్యులు ట్రోపీతో స్టేడియంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

India vs South Africa ODI Series: వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ట్రోపీ అందుకొని తొడగొట్టిన శిఖర ధావన్.. ట్విటర్‌లో వీడియో పోస్టు చేసిన బీసీసీఐ

Shikhar Dhawan

Updated On : October 12, 2022 / 8:43 AM IST

India vs South Africa ODI Series: టీమిండియా యువ ఆటగాళ్లు విజృంభించారు. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ జట్టు.. వన్డేల్లోనూ తన సత్తాను చాటి సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ప్రధాన జట్టును మించి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ద్వితీయ శ్రేణి జట్టు వన్డే సిరీస్‌లో ప్రత్యర్థి జట్టుకు పరాభవాన్ని మిగిల్చింది.

India vs South Africa: చివరి వన్డేలో 99 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్.. 4 వికెట్లు తీసిన కుల్దీప్ 

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే జరిగింది. టాస్ గెలిచి భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచి భారత్ బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో కేవలం 99 పరుగులు మాత్రమే చేసి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఆల్‌ఔట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 19.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 105 చేసి లక్ష్యాన్ని ఛేదించింది.