India vs South Africa: చివరి వన్డేలో 99 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్.. 4 వికెట్లు తీసిన కుల్దీప్ 

భారత్-దక్షిణాఫ్రికా మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. నిర్ణయాత్మక మూడో మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాను 27.1 ఓవర్ల వద్ద 99 పరుగులకే భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, షెహబాబ్ అహ్మద్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీశారు.

India vs South Africa: చివరి వన్డేలో 99 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్.. 4 వికెట్లు తీసిన కుల్దీప్ 

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. నిర్ణయాత్మక మూడో మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా సారథి శిఖర్ ధావన్ మొదట బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాను 27.1 ఓవర్ల వద్ద 99 పరుగులకే భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, షెహబాబ్ అహ్మద్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జన్నెమాల్ మాలన్ 15, క్లాసేన్ 34, మ్యాక్రో జాన్సేస్ 14 పరుగులు తప్ప మిగతా ఏ ఆటగాడూ కనీసం రెండంకెల పరుగులు చేయలేదు. దీంతో టీమిండియా ముందు 100 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంది. కాగా, ఈ మ్యాచు ఇవాళ మధ్యాహ్నం 1.30కే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓ మ్యాచ్ ఓడిపోగా, ఓ మ్యాచ్ గెలుపొందింది. దీంతో ఇరు జట్లు 1-1 తేడాలో సమంగా ఉన్నాయి. నేటి నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..