Woodlands Hospital : కోలుకున్న గంగూలీ..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

కరోనా పరీక్షలు చేయగా...నెగటివ్ వచ్చింది. దీంతో గంగూలీని డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది బయటకు వచ్చి గంగూలీకి సెకండాఫ్ చెప్పారు.

Woodlands Hospital : కోలుకున్న గంగూలీ..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Ganguly

BCCI President Ganguly : టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కరోనా నుంచి కోలుకున్నారు. గత కొద్ది రోజులుగా…కోల్ కతాలోని ఉడ్ లాండ్ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 2021, డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం వైద్యులు మరోసారి ఆయన్ను పరీక్షించారు. కరోనా పరీక్షలు చేయగా…నెగటివ్ వచ్చింది. దీంతో గంగూలీని డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది బయటకు వచ్చి గంగూలీకి సెకండాఫ్ చెప్పారు.

Read More : Telangana Liquor : లిక్కర్ స్కేల్ లో రికార్డు…డిసెంబర్ నెలలో రూ. 3 వేల 350 కోట్ల మద్యం అమ్మకాలు

అక్కడే ఉన్న మీడియాకు ఒకే అంటూ..సైగలు చేస్తూ..కారు ఎక్కి వెళ్లిపోయారు గంగూలీ. నాలుగు రోజుల క్రితం అలసటగా ఉండడంతో గంగూలీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్ గా రావడంతో..అభిమానులు ఆందోళన చెందారు. ఇటీవలే ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు కోవిడ్ టీకా తీసుకున్నారు.

Read More : New Florona Variant ఇజ్రాయెల్ లో బయటపడ్డ మరో కొత్తరకం కరోనా వేరియంట్ “ఫ్లోరోనా”

48 సంవత్సరాలున్న మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలోని తన నివాసంలో ఉన్న జిమ్‌లో వర్క్ఔట్ చేస్తూ అస్వస్థతకి గురై కిందపడిపోయిన గంగూలీకి.. 2021, జనవరి 27వ తేదీన ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. తొలుత గుండెపోటు వచ్చిన సమయంలోనే ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేయగా.. 13 మంది డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఐదు రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. అంతా బాగుందని అనుకోగా.. మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ చేశారు. భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన సౌరవ్ గంగూలీ.. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1,349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్‌ 10 వికెట్లని సౌరవ్ పడగొట్టారు.