Mahika Gaur : ధోనిని ఆరాధించే క్రికెట‌ర్‌.. చ‌రిత్ర సృష్టించింది

12 ఏళ్ల వ‌య‌సులోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన క్రికెట‌ర్ మహికా గౌర్ (Mahika Gaur) తాజాగా చ‌రిత్ర సృష్టించింది.

Mahika Gaur : ధోనిని ఆరాధించే క్రికెట‌ర్‌.. చ‌రిత్ర సృష్టించింది

Mahika Gaur

Mahika Gaur creates History : 12 ఏళ్ల వ‌య‌సులోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన క్రికెట‌ర్ మహికా గౌర్ (Mahika Gaur) తాజాగా చ‌రిత్ర సృష్టించింది. రెండు దేశాల‌కు ప్రాతినిథ్యం వ‌హించిన మ‌హిళా ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే మ‌హిళా క్రికెట‌ర్ కూడా రెండు దేశాల‌కు ఆడ‌లేదు. శుక్ర‌వారం నాడు శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ త‌రుపున ఆడిన మ‌హికా ఈ ఘ‌న‌త‌ను అందుకుంది. నాలుగు సంవ‌త్స‌రాల క్రితం ఆమె యూఏఈ జ‌ట్టు త‌రుపున ఆడింది.

శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓ వికెట్‌ను కూడా తీసింది. ఇంగ్లాండ్ త‌రుపున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆమెకు ఇదే తొలి వికెట్ కావ‌డం విశేషం. అయితే.. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ మ‌ధ్య‌లోనే నిలిచి పోవ‌డంతో మ‌హికాకు మ‌రిన్ని వికెట్లు తీసే అవ‌కాశం ద‌క్క‌లేదు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో 12 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Rinku Singh : సూప‌ర్ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ పెను విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స‌ర్లు.. వీడియో వైర‌ల్‌

ఎంఎస్‌ ధోనీ, మిచెల్ స్టార్క్‌లు రోల్ మోడ‌ల్స్‌..

2006 మార్చి 9న దక్షిణ ఇంగ్లాండ్‌లోని రీడింగ్‌లో జ‌న్మించింది. ఆమెకు ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు 2011లో ఐపీఎల్‌లో భాగంగా జైపూర్‌లో జరిగిన రాజ‌స్థాన్‌, ఢిల్లీ మ‌ధ్య మ్యాచ్‌ను చూసి క్రికెట‌ర్ కావాల‌ని ఆశ‌ప‌డింది. ఆమెకు భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు మ‌హేంద్ర సింగ్ ధోని, ఆస్ట్రేలియా పేస‌ర్ మిచెల్ స్టార్క్‌లు అంటే చాలా ఇష్ట‌మ‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పింది.

Asia Cup 2023: ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాక్ తలపడ్డ మ్యాచ్‌ల వివరాలు ఇలా.. పైచేయి ఎవరిదంటే?

కొన్ని కార‌ణాల వ‌ల్ల మ‌హికా కుటుంబం ఇంగ్లాండ్ నుంచి దుబాయ్‌కు వెళ్లింది. దీంతో ఆమె ఐసీసీ అకాడ‌మీలో చేరింది. 2019లో యూఏఈ జ‌ట్టు త‌రుపున ఆడే అవ‌కాశం వ‌చ్చింది. మొత్తంగా ఆ జ‌ట్టు త‌రుపున 19 టీ20 మ్యాచులు ఆడి 9 వికెట్లు తీసింది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్ ఏ జ‌ట్టుకు ఎంపికైంది. ఇక ఇప్పుడు జాతీయ జ‌ట్టులోకి అడుగుపెట్టింది. దీంతో రెండు దేశాల త‌రుపున అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన ఏకైక మ‌హిళా క్రికెట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది.