ODI World Cup 2023 : కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన‌ డేవిడ్ వార్న‌ర్‌.. ఏ రికార్డో తెలుసా..?

ఆస్ట్రేలియా విధ్వంసక‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అరుదైన ఘ‌నత సాధించాడు.

ODI World Cup 2023 : కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన‌ డేవిడ్ వార్న‌ర్‌.. ఏ రికార్డో తెలుసా..?

David Warner-Virat Kohli

ODI World Cup : ఆస్ట్రేలియా విధ్వంసక‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ అరుదైన ఘ‌నత సాధించాడు. భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న వార్న‌ర్‌.. ధ‌ర్మ‌శాల వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఆక‌ట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న వార్న‌ర్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్స‌ర్లతో 81 ప‌రుగులు చేశాడు. ఈ నేప‌థ్యంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన నాలుగో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్‌, రికీ పాంటింగ్‌, కుమార సంగ‌క్క‌ర‌ల త‌రువాతి స్థానంలో వార్న‌ర్ నిలిచాడు. వార్న‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు 24 ప్ర‌పంచ‌క‌ప్ ఇన్నింగ్స్‌ల్లో 1405 ప‌రుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 31 ఇన్నింగ్స్‌ల్లో 1,384 ప‌రుగుల‌తో ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇదిలాఉంటే.. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో వార్న‌ర్ ఆరు మ్యాచుల్లో 413 ప‌రుగులు చేసి అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో టాప్‌-3లో కొన‌సాగుతున్నాడు.

ODI World Cup 2023 : పాక్ జట్టుకు మద్దతుగా నిలిచిన హర్భజన్ సింగ్.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కౌంటర్.. అలా ఎందుకంటే?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవ‌ర్ల‌లో 388 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ (109; 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంస‌క‌ర శ‌త‌కం బాదాడు. డేవిడ్ వార్న‌ర్ (81; 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 41, జోష్ ఇంగ్లిస్ 38, పాట్ కమిన్స్ 37, మిచెల్ మార్ష్ 36, స్టీవెన్ స్మిత్ 18, లబుషేన్ 18 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫిలిప్స్ మూడేసి వికెట్లు తీశారు. మిచెల్ సాంట్నర్ రెండు, మాట్ హెన్రీ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.