PV Sindhu: డెన్మార్క్ ఓపెన్‌లో చెలరేగిన సింధు..

ఇండియా షట్లర్ పీవీ సింధు.. గ్యాప్ తర్వాత మళ్లీ టోర్నీల్లోకి అడుగుపెట్టడమే కాక విజయంతో ఆరంభించింది. మంగళవారం డెన్మార్క్ ఓపెన్ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆడారు.

PV Sindhu: డెన్మార్క్ ఓపెన్‌లో చెలరేగిన సింధు..

Pv Sindhu

PV Sindhu: ఇండియా షట్లర్ పీవీ సింధు.. గ్యాప్ తర్వాత మళ్లీ టోర్నీల్లోకి అడుగుపెట్టడమే కాక విజయంతో ఆరంభించింది. మంగళవారం డెన్మార్క్ ఓపెన్ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆడారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన సింధు 21–12, 21–10తో నెస్లిహాన్‌ యిగిట్‌ (టర్కీ)పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది.

వరుస గేమ్ లలో ఆదిపత్యం చెలాయించి కేవలం 30నిమిషాల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. తొలిగేమ్ ఆరంభంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదుర్కొని ఓ దశలో 5-4తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత నుంచి స్మాష్ లు, క్రాస్ కోర్టు షాట్లతో చెలరేగిపోయింది. రెండో రౌండ్లో బుసానన్ తో తలపడనుంది.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–14, 21–11తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై గెలవగా… సమీర్‌ వర్మ 21–17, 21–14తో థాయ్‌లాండ్‌‌కు చెందిన కున్లావుత్‌ వితిద్‌సర్న్‌‌ను ఓడించాడు.

……………………………………………: పెద్ద పాపకేమో డ్రెస్ కాస్త చిన్నదాయెరో!

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ధ్రువ్‌ ద్వయం 14–21, 21–17, 21–18తో ప్రపంచ 25వ ర్యాంక్‌ జోడీ హూ పాంగ్‌ రోన్‌–చె యి సీ (మలేసియా)పై సంచలన విక్టరీ దక్కించుకుంది.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సాత్విక్‌ –చిరాగ్‌ 23–21, 21–15తో హెమింగ్‌ –స్టాల్‌వుడ్‌ (ఇంగ్లాండ్‌)లపై, అర్జున్‌–ధ్రువ్‌ 21–19, 21–15తో బెన్‌ లేన్‌–సీన్‌ వెండీ (ఇంగ్లాండ్‌)లపై గెలిచారు. సుమీత్‌–మనూ 18–21, 11–21తో గోసెఫె –నూరు జుద్దీన్‌ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.