T20 World Cup: టీమ్‌లో ఒక్కరే లీడర్ ఉండాలి.. ఏడుగురు కాదు.. రోహిత్ కెప్టెన్సీ‌పై అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు..

టీమ్‌లో ఒక్కరే లీడర్ ఉండాలి. ఏడుగురు ఉంటే కష్టమే అంటూ మాజీ క్రికెటర్అ జయ్ జడేజా వ్యాఖ్యానించాడు. ఈ సంవత్సరం టీమిండియా వివిధ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో అనేక మంది కెప్టెన్‌లుగా బాధ్యత వహించారు.

T20 World Cup: టీమ్‌లో ఒక్కరే లీడర్ ఉండాలి.. ఏడుగురు కాదు.. రోహిత్ కెప్టెన్సీ‌పై అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు..

Rohit Sharma

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 10వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. సెమీస్‌లో విజయం సాధించి ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టుతో తలపడుతుందని ఇండియాలోని క్రికెట్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ టీమిండియా ఆటగాళ్లు వారి ఆశలపై నీళ్లుచ్చారు. ఈ క్రమంలో జట్టులోని ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు.

T20 World Cup 2022: ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోర ఓటమి.. నెట్టింట్లో పేలుతున్న జోకులే జోకులు ..

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. కానీ ఈ టోర్నీలో ఆరు ఇన్నింగ్స్‌లలో 19.33 సగటు సగటుతో కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. టోర్నమెంట్ సెమీ-ఫైనల్ సమయంలో రోహిత్ కెప్టెన్సీ నిర్ణయాలపైనా పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా రోహిత్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రిక్‌బజ్‌లో మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు బాధ కలిగించే ఒక విషయం చెప్తాను.. కెప్టెన్‌గా జట్టును తయారు చేయాలంటే, మీరు ఏడాది పొడవునా జట్టుతో ప్రయాణం చేయాలి. ఈ ఏడాది రోహిత్ శర్మ ఎన్ని సిరీస్‌లు ఆడాడు అంటూ జడేజా ప్రశ్నించాడు. నేను ఈ విషయం చెప్పడం లేదు.. రికార్డులు చూస్తే తెలుస్తుందన్నారు.

India vs England Semi Final Match: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్.. ఫొటో గ్యాలరీ

టీమ్‌లో ఒక్కరే లీడర్ ఉండాలి. ఏడుగురు ఉంటే కష్టమే అంటూ అజయ్ జడేజా వ్యాఖ్యానించాడు. ఈ సంవత్సరం టీమిండియా వివిధ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో అనేక మంది కెప్టెన్‌లను చూసింది. జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్ నాయకత్వం వహించగా, హార్దిక్ పాండ్యా ఐర్లాండ్‌తో జరిగిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.