Gautam Gambhir : కోహ్లితో గొడవ.. తొలిసారి స్పందించిన గౌతమ్ గంభీర్.. నవీన్ తప్పేమీ లేదట
ఇటీవల ముగిసిన ఐపీఎల్(IPL)లో లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir), బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం పై తొలిసారి గౌతమ్ గంభీర్ స్పందించాడు.

Kohli vs Gambhir
Kohli vs Gambhir:ఇటీవల ముగిసిన ఐపీఎల్(IPL)లో లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir), బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం పై తొలిసారి గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఆ రోజు జరిగిన దానిలో తమ జట్టు ఆటగాడు నవీన్ ఉల్ హక్(Naveen ul haq) తప్పేం లేదని అందుకే తాను అతడి వైపు నిలబడ్డానని చెప్పుకొచ్చాడు. తన దృష్టిలో నవీన్ చేసింది కరెక్టే అని, అతడికి అండగా నిలబడడం తన కనీస బాధ్యత అని తెలిపాడు.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లేదా ఇతర ఏ ఆటగాడితోనైనా తన అనుబంధం ఒకేలా ఉంటుందని గంభీర్ చెప్పాడు. ఏదైన వివాదం చోటు చేసుకుంటే అది మైదానం వరకు మాత్రమే పరిమితం అని వ్యక్తిగతంగా ఏమీ ఉండదన్నాడు. తన లాగే వాళ్లు కూడా గెలవాలని కోరుకుంటారని అన్నాడు.
Virat Kohli : గంభీర్‌తో గొడవపై స్పందించిన కోహ్లీ..
గ్రౌండ్‌లో వివాదాలు జరిగినప్పుడు టీఆర్‌పీల కోసం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతారని, కొందరు గొడవ పై స్పష్టత ఇవ్వాలని తనను కోరినట్లు గంభీర్ చెప్పాడు. అయితే తాను మాత్రం అక్కడ ఏం జరిగిందనేది ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదని బావిస్తున్నట్లు తెలిపాడు. అక్కడ నవీన్ ఉన్నా మరే ఆటగాడు ఉన్నా తాను అలాగే ప్రవర్తించేవాడినని, తన తత్వమే అది అని అన్నాడు.
మీరు విదేశీ ఆటగాడిని సమర్ధిస్తున్నారా..? అంటూ కొందరు తనను తప్పుబట్టారని, అయితే.. అక్కడ ఉన్నది మన ఆటగాడా కాదా అన్నది తనకు ముఖ్యం కాదని, తప్పు చేయలేదని తాను బావిస్తే అండగా ఉంటానని, ఒక వేళ తన జట్టు ఆటగాడు తప్పు చేసినట్లు అనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతడికి మద్దతుగా ఉండనని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Virat Kohli: గంభీర్‌తో గొడవ.. మరుసటి రోజు భార్యతో కలిసి విరాట్ ఏం చేశాడంటే..?