గుండెదడ పెంచిన ఫైనల్ ఓవర్

గుండెదడ పెంచిన ఫైనల్ ఓవర్

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2019ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు సమఉజ్జీల మధ్య పోరును ఆసక్తిగా వీక్షించారు. స్టేడియమంతా నిశ్శబ్దంగా  తమ జట్టు విజయాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేసుకుంటూ కెమెరా కంటపడ్డారు. సాక్షి ధోనీ, మిస్సెస్ అంబానీ తమ జట్టే గెలవాలని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. 

చెన్నై ఓపెనర్ వాట్సన్ దూకుడుకి చివరి ఓవర్ వరకూ విజయం అటుఇటుగా అనిపించింది. ఆఖరి ఓవర్ వచ్చేసరికి చెన్నై ముందు 9పరుగుల స్కోరుమాత్రమే ఉంది. చేతిలో 5వికెట్లు ఉన్నాయి. క్రీజులో వాట్సన్(76 పరుగులతో), జడేజా(4 పరుగులతో) ఉన్నారు. 

అప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్న మలింగపై నమ్మకముంచాడు రోహిత్. లసిత్ మలింగకే చివరి ఓవర్ అప్పగించాడు. దీంతో ఆ ఓవర్ సాగిందిలా..

  • 19.1 తొలి బంతికి వాట్సన్ ఒక్క పరుగు తీయగలిగాడు. 
  • 19.2 రెండో బంతికి జడేజాకు ఒక్క పరుగు దక్కింది. 
  • 19.3 మరోసారి వాట్సన్ స్ట్రైకింగ్ రావడంతో స్కోరు బోర్డులో 2పరుగులు చేరాయి.  
  • 19.4 ఈ సారి బంతికి వాట్సన్ రనౌట్ అయ్యాడు. ఒక పరుగు పూర్తి చేసి రెండో పరుగు చేసే క్రమంలోనే అవుట్ గా వెనుదిరిగాడు. 

అప్పటికీ మిగిలింది 2 బంతులు 4పరుగులు..

  • 19.5 వాట్సన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఠాకూర్ 2పరుగులు కొట్టేశాడు. 

ఇంకా ఒక్క బాల్.. 2పరుగులు. ఒకటి చేస్తే సూపర్ ఓవర్. 2కొడితే విజయం. మళ్లీ స్ట్రైకింగ్ ఠాకూర్‌దే. 

  • 19.6 మలింగ తెలివిగా స్లోయర్ ఆఫ్ కట్టర్‌ను ఫ్రయోగించాడు.

ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ఠాకూర్ అవుట్ అయ్యాడు. అప్పటికే రివ్యూలు అన్నీ పూర్తయిపోవడంతో చెన్నై ఓడిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు 2013, 2015, 2017, 2019 సీజన్ల టైటిళ్లు సొంతం చేసుకుంది.