ఐసీసీ వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్‌గా కోహ్లీ, కీపర్‌గా పంత్

ఐసీసీ వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్‌గా కోహ్లీ, కీపర్‌గా పంత్

భారత జట్టుకే కాదు అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పరుగుల యంత్రం, విధ్వంసాల వీరుడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటనతో సంవత్సరాన్ని ముగించిన కోహ్లీ ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మేర ఐసీసీ కోహ్లీని పలు అవార్డులతో సత్కరించడమే కాకుండా వన్డే, టెస్టు ఫార్మాట్లకు కెప్టెన్‌గా పేర్కొంటూ జట్లను ప్రకటించింది. ఇందులో కీలకంగా భారత నుంచి నలుగురు ప్లేయర్లు స్థానం దక్కించుకున్నారు. 

ఐసీసీ వన్డే జట్టు:
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని పేర్కొంటూ రోహిత్ శర్మను ఓపెనర్‌గా, జస్ప్రిత్ బుమ్రాతో పాటు కుల్దీప్ యాదవ్‌ను స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకుంది. మిగిలిన ప్లేయర్లలో జానీ బెయిర్ స్టో, జోస్ రూట్, రోస్ టేలర్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, ముస్తఫిజుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రాలు ఉన్నారు.   

 

ఐసీసీ టెస్టు జట్టు:
టెస్టు జట్టులోనూ కోహ్లీకి అగ్రస్థానాన్ని సూచిస్తూ కెప్టెన్‌గా పేర్కొంది. రిషబ్ పంత్‌కు వికెట్ కీపర్‌గా స్థానాన్ని కల్పిస్తూ బుమ్రాకు బౌలర్‌గా అవకాశం కల్పించింది. జట్టుకు ఓపెనర్లుగా టామ్ లూథమ్(న్యూజిలాండ్), దిముత్(శ్రీ లంక), హెన్రీ నికోలస్(న్యూజిలాండ్), జాస్ హోల్డర్(వెస్టిండీస్), కగిసో రబాడ(దక్షిణాఫ్రికా), నాథన్ లయన్(ఆస్ట్రేలియా), మొహమ్మద్ అబ్బాస్(పాకిస్తాన్)