IND vs SL : కోహ్లీకి ద్రవిడ్ సన్మానం.. పక్కనే ఉన్న అనుష్క

కోహ్లీపై ద్రవీడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చిన్నతనంలోనే భారతదేశం కోసం ఒక టెస్టు ఆడాలని భావించారని.. ఇప్పుడు వందో టెస్టు ఆడుతున్నారని తెలిపారు. క్రమశిక్షణ, ధైర్యం, నైపుణ్యం...

IND vs SL : కోహ్లీకి ద్రవిడ్ సన్మానం.. పక్కనే ఉన్న అనుష్క

Kohli

Rahul Dravid And Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని హెడ్ కోచ్ రాహల్ ద్రవిడ్ ఘనంగా సత్కరించారు. చారిత్రాత్మక వందో టెస్టు ఆడుతున్న సందర్భంగా కోహ్లీ సతీమణి అనుష్క సమక్షంలో టోపీని అందచేశారు. టీమిండియా ప్లేయర్లు వరుసగా నిలబడగా.. కోహ్లీకి సత్కారం జరిగింది. ఈ సందర్భంగా కోహ్లీ ఫ్యామిలీ స్టేడియానికి విచ్చేసింది. మొహలీలోని పంజాబ్ క్రికట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ – శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తో 100 టెస్టు ఆడుతున్న క్రీడాకారుడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పి 12వ భారతీయుడయ్యారు.

Read More : India vs Sri Lanka : టీమిండియా మరో పోరు.. కోహ్లీ 100వ టెస్టు

ఈ సందర్భంగా కోహ్లీపై ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చిన్నతనంలోనే భారతదేశం కోసం ఒక టెస్టు ఆడాలని భావించారని.. ఇప్పుడు వందో టెస్టు ఆడుతున్నారని తెలిపారు. క్రమశిక్షణ, ధైర్యం, నైపుణ్యం, ధృడసంకల్పం, ఏకాగ్రత అన్నీ మీలో ఉన్నాయన్నారు. వందో టెస్టు మ్యాచ్ ఆడడమే కాకుండా క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప ప్రయాణం చేయడం గర్వించదగిన విషయమన్నారు. అద్భత విజయానికి మీ కుటుంసభ్యులకు అభినందనలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు ద్రవిడ్.
టోపీని స్వీకరించిన అనంతరం కోహ్లీ భావోద్వేగంతో మాట్లాడాడు.

Read More : Virat Kohli: కోహ్లీ వందో టెస్టు.. విషెస్ తెలిపిన క్రికెట్ లెజెండ్స్

చిన్ననాటి మిత్రులలో ద్రవిడ్ కూడా ఒకరని, సత్కరించినందుకు ద్రవీడ్ కు.. బీసీసీఐకి ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. తన భార్య ఇక్కడుండడం, స్టాండ్ లో తన ఫ్యామిలీ ఉండడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఇక కోహ్లీ విషయానికి వస్తే… 50.4 సగటుతో 7962 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. 27 సెంచరీలు బాదాడు. 68 మ్యాచ్ ల్లో 40 విజయాల రికార్డు నెలకొల్పి అత్యంత విజయమైన కెప్టెన్ గా నిలిచాడు. సత్కరించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎంతో మంది కోహ్లీకి అభినందనలు తెలియచేస్తున్నారు.