Border–Gavaskar Trophy: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య 5 అతి పెద్ద వివాదాలు ఇవే..

భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య రేపటి నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆసీస్ మాటల యుద్ధాన్ని మొదలు పెట్టింది. రేపు నాగ్‌పూర్ లో మొదటి టెస్టు మ్యాచు ప్రారంభం కావాల్సి ఉండగా, పిచ్ బాగోలేదంటూ ఆస్ట్రేలియా ఇప్పటికే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గతంలోనూ అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో 5 అతి పెద్ద వివాదాలు ఏంటో చూద్దాం..

Border–Gavaskar Trophy: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య 5 అతి పెద్ద వివాదాలు ఇవే..

Border–Gavaskar Trophy

Border–Gavaskar Trophy: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య రేపటి నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆసీస్ మాటల యుద్ధాన్ని మొదలు పెట్టింది. రేపు నాగ్‌పూర్ లో మొదటి టెస్టు మ్యాచు ప్రారంభం కావాల్సి ఉండగా, పిచ్ బాగోలేదంటూ ఆస్ట్రేలియా ఇప్పటికే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గతంలోనూ అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో 5 అతి పెద్ద వివాదాలు ఏంటో చూద్దాం..

మైదానం నుంచి వెళ్లిపోయిన గవాస్కర్, చేతన్ చౌహాన్

అది 1981వ సంవత్సరం.. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా బ్యాట్స్ మెన్ గవాస్కర్, చేతన్ చౌహాన్ క్రీజులో ఉన్నారు. అయితే, మైదానంలో ఎంతో ఓపికతో ఉండే సునీల్ గవాస్కర్.. ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయాడు. ఎందుకంటే, అప్పటి ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ విసిరిన బంతిని ఎల్బీడబ్ల్యూ ఔట్ గా ఇచ్చాడు అంపైర్.

అయితే, అది ఔట్ కాదని సునీల్ గవాస్కర్ బలంగా నమ్మారు. మైదానంలో నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న సునీల్ గవాస్కర్ పై డెన్నీస్ లిల్లీ పలు వ్యాఖ్యలు చేశారు. సునీల్ గవాస్కర్ కు మరింత కోపం వచ్చి తన ప్యాడ్ ను బ్యాట్ తో కొట్టి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మైదానం నుంచి తనతో పాటు వచ్చేయాలని చేతన్ చౌహాన్ కు గవాస్కర్ చెప్పారు. ఇద్దరూ కలిసి మైదానం వదిలి వెళ్లారు. దీంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. బౌండరీ లైన్ వద్ద గవాస్కర్, చేతన్ ను అప్పటి టీమ్ మేనేజర్ షాహిద్ దురానీ, అసిస్టెంట్ మేనేజర్ బాపూ కలిపి వారికి నచ్చజెప్పారు. దీంతో చౌహాన్ బ్యాటింగ్ చేసేందుకు తిరిగి మైదానంలోకి వెళ్లారు.

2008లో మంకీ గేట్ వివాదం

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2008లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ ను టీమిండియా ఆటగాడు హర్భజన్ సింగ్ ‘మంకీ’ అని అన్నాడని దుమారం చెలరేగింది. జాత్యహంకార వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే, హర్భజన్ సింగ్ మంకీ అని అనలేదని.. ‘తేరీ మా కీ’ అని హిందీలో అన్నట్లు తెలుస్తోంది. ఉత్తర భారత్ లో ఈ ఊత పదాన్ని బాగా వాడుతుంటారు. అయితే, హర్భజన్ చేసిన వ్యాఖ్యపై ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాథ్యూ హేడెన్, కెప్టెన్ రికీ పాంటింగ్ కలిసి హర్భజన్ తో చాలాసేపు మాట్లాడారు. అనంతరం, హర్భజన్ మంకీ అన్నాడని వారు కూడా ఆరోపించారు. హర్భజన్ పై అప్పట్లో నిషేధం విధించారు.

2012లో కోహ్లీ-ఆస్ట్రేలియా అభిమానుల మధ్య గొడవ

సిడ్నీలో 2012లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడిపై ఆస్ట్రేలియా అభిమానులు దూషణలు చేశారు. దీంతో కోహ్లీకి కోపం వచ్చి తన కుడిచేతి మధ్య వేలును ఆస్ట్రేలియా అభిమానులకు చూపించాడు. ఆ ఫొటోలను అప్పట్లో అన్ని వార్తా పత్రికల్లోనూ ప్రచురించారు.

2017: అపఖ్యాతిపాలైన స్మిత్

బెంగళూరులో 2017లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ వెనుదిరగాల్సి వచ్చింది. అయితే, ఆ సమయంలో స్మీత్ స్మిత్ మైదానంలోనే ఉండి డీఆర్ఎస్ కోరాలంటూ తోటి బ్యాట్స్ మన్ పెటెర్ ను, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపునకు చూశారు. ఎల్బీడబ్ల్యూను స్మిత్ తప్పుగా అంచనా వేసినట్లు స్పష్టంగా తెలిసింది. దీంతో ఈ విషయాన్ని కోహ్లీ అంపైర్లతో మాట్లాడాడు. స్మిత్ ను మైదానం నుంచి వెళ్లిపోవాలని అంపైర్లు సూచించారు. ఆ సమయంలో సరిగ్గా ఆలోచించలేకపోయిన స్మిత్ అపఖ్యాతి పాలయ్యారు.

2021లో జాత్యహంకార వ్యాఖ్యలు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2021లో మ్యాచ్ జరుగుతోంది.. టీమిండియా బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా ప్రేక్షకుల నుంచి జాత్యహంకార వ్యాఖ్యలు వినపడ్డాయి. దీంతో భారత్ జట్టు మేనేజ్ మెంట్ దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. చివరకు స్టేడియం నుంచి ఆరుగురు ఆస్ట్రేలియా అభిమానులను బయటకు పంపించేశారు.

IND vs AUS Test Match: గోల షురూ.. ఐసీసీ జోక్యం చేసుకోవాలట.. నాగ్‌పూర్ పిచ్‌పై అక్కసు వెళ్లగక్కిన ఆస్ట్రేలియా ..