Asia Cup Final 2023: ఫైనల్ పోరు.. అమీతుమీకి సిద్ధమైన భారత్, శ్రీలంక జట్లు.. ఇరు జట్ల బలాబలాలు ఇలా..

కోలంబో వేదికగా జరిగే ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడేందుకు 50శాతం అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Asia Cup Final 2023: ఫైనల్ పోరు.. అమీతుమీకి సిద్ధమైన భారత్, శ్రీలంక జట్లు.. ఇరు జట్ల బలాబలాలు ఇలా..

India vs Sri lanka Match

Asia Cup Final Match 2023: ఆసియా కప్ 2023 టోర్నీలో ఇవాళ జరిగే ఫైనల్ పోరుకోసం భారత్, శ్రీలంక జట్లు సన్నద్ధమయ్యాయి. అతిథ్య శ్రీలంక జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమైంది. కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు చెలరేగే అవకాశముంది. కొలంబోలో పిచ్ స్పిన్నర్లకే అనుకూలించనుంది. దీంతో ఇరు జట్ల స్పిన్నర్లలో ఎవరిది పైచేయి అవుతుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. సొంతగడ్డపై ఆడుతుండటం శ్రీలంక జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే, శ్రీలంక జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమవ్వడం ఆ జట్టును కొంత కలవరానికి గురిచేసే అంశం.

Asia Cup 2023 : ఫైన‌ల్‌కు ముందు శ్రీలంక‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. భార‌త్‌కు స‌గం క‌ష్టాలు త‌ప్పిన‌ట్లే..!

శ్రీలంక జట్టును ఓడించాలంటే భారత్‌కు అంతతేలికేం కాదు. శ్రీలంకపై విజయం సాధించాలంటే భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. ఫామ్ లో ఉన్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లోనూ వీరు మంచి ఆరంభాన్ని ఇస్తే సగం విజయం భారత్ వైపుకు వచ్చి చేరుతుంది. లంకపై సూపర్ -4 మ్యాచ్‌లో విఫలమైన కోహ్లీ.. ఫైనల్ మ్యాచ్‌లో రాణిస్తాడని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ జట్టుకు విజయావకాశాలు మెరుగవుతాయని మాజీలు పేర్కొంటున్నారు. మిడిల్ ఆర్డర్ లో రాహుల్, హార్దిక్, జడేజా వంటి క్లీలక ప్లేయర్స్ రాణిస్తే భారత్ జట్టు విజయం నల్లేరుపై నడకే అవుతుందని చెప్పొచ్చు. మరోవైపు బౌలింగ్ విభాగంలో భారత్ మెరుగ్గానే ఉంది. అయితే, ఫైనల్ మ్యాచ్ లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుస్తోంది. దీంతో భారత్ స్పిన్నర్లు తమ హవా సాగించాల్సి ఉంది.

Asia Cup 2023 : ఓట‌ముల చుట్టూ ప‌రిభ్ర‌మించిన విజ‌యం..!

శ్రీలంక స్పిన్ బౌలింగ్ మెరుగ్గా ఉంది. భారత్ బ్యాటర్లు ముఖ్యంగా స్పిన్నర్ వెల్లలాగే పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సూపర్-4 మ్యాచ్‌లో అదిరే ఆరంభం తరువాత స్పిన్నర్ వెల్లలాగే ధాటికి భారత్ ఎలా తడబడిందో తెలిసిందే. మరో స్పిన్నర్ తీక్షణ గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ కు దూరమవ్వడం భారత్ కు కొంతకలిసొచ్చే అంశం. మరోవైపు పేసర్ పతిరనతోనూ ముప్పు పొంచి ఉంది. ఇక భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. టీమింయా పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆరంభంలోనే వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి బ్యాటర్లను చిక్కుల్లోకి నెట్టేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లోనూ బుమ్రా, సిరాజ్‌లు ఆరంభంలో వికెట్లను పడగొట్టి.. స్పిన్ విభాగంలో జడేజా, కుల్‌దీప్ రాణిస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే అవుతుంది.

Asia Cup 2023 : శ్రీలంకతో ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్‌.. దినేశ్ కార్తీక్ ట్వీట్‌కు అర్థం అదేనా..?

ఆసియా కప్ చరిత్రలో భారత్ ఏడు సార్లు కప్ గెలుచుకోగా, శ్రీలంక జట్టు ఆరు సార్లు గెలుచుకుంది. ఇదిలాఉంటే ఈరోజు జరిగే  ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచిఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడేందుకు 50శాతం అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవేళ వర్షంపడి మ్యాచ్ నిలిచిపోతే మరుసటి రోజు సోమవారం మ్యాచ్ నిర్వహించేందుకు రిజర్వ్ డేను కేటాయించారు.